మహిళలకు ఎక్కడ రక్షణ లేదు అన్న విషయం తెలిసిందే..ఆడవాళ్ళ రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలను  ముందుకు తీసుకొస్తున్న కూడా మహిళలు అన్నిటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఉన్నతాధికారులు గా ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్ళను వదలట్లేదు..కామంతో కళ్లు మూసుకు పోయిన మృగాళ్లు కోరిక తీర్చమంటూ తమ సహోద్యోగినిని వేధింపులకు గురి చేసిన ఘటన వెలుగుచూసింది. తనని తన భర్త లాగా భావించి కోరిక తీర్చాలని వేధించాడు.. అతని మాట కరెక్టే తప్పు లేదంటూ మరో అధికారి అందుకు సపోర్ట్ చేయడం చర్చ నియాంశంగా మారింది.

 

 

 

అసలు విషయానికొస్తే.. మహిళలను రక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మహిళలకు రక్షణ లేదు..తమ కామవాంఛలు తీర్చాలంటూ ఓ మహిళా హోంగార్డును ఆమె సహోద్యోగులు వేధింపులకు గురి చేయడంతో ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. సిటీలోని జయనగర్ పోలీస్ స్టేషన్‌లో వివాహిత మహిళ హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తోంది. జయనగర్‌లోని ఉమెన్స్ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ వద్ద డ్యూటీ చేస్తోంది. 

 

 


అయితే ఆమెకు గత కొంత కాలంగా తన పైఅధికారి లైంగికంగా వేధించేవాడు.. నన్ను నీ భర్తలగా భావించి  కోరిక తీర్చాలని డిమాండ్ చేసేవారు.. మరో హోంగార్డు  అతనికి వంతపాడుతూ.. అతను మన పైఅధికారి ఆ సంబంధం పెట్టుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందంటూ ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగని ఇద్దరూ శ్రుతిమించారు. భర్తకు అబద్ధం చెప్పి తమ ఇద్దరితో ప్రైవేట్ ట్రిప్‌కి రమ్మంటూ వేధించడంతో భరించలేక ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించింది... ఆమె పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు.. పోలీసు శాఖలోని ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోవడంతో ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు..ఆ ఇద్దరినీ వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: