ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రజలను వనికిస్తో వస్తుంది..కేవలం ఒక్క రోజులో కొన్ని వేల మందికి కరోనా సోకింది.. రోజు రోజుకు ప్రభావం పెరుగుతుండటంతో ప్రజల మధ్య సామాజిక దూరం పాటించాలని లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.. ఈ లాక్ డౌన్ కారణంగా పనులన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అయితే ఎంత కట్టడి చేస్తున్న కూడా కరోనా ప్రభావం పెరుగుతూనే ఉంది.. దీంతో ఇప్పుడు చాలా కఠినంగా చర్యలు అమలు అవుతున్నాయి.. 

 

 


హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఇద్దరు అమ్మాయిల తో అసభ్యకరం గా ప్రవర్తించిన ఓ పంచాయితీ రాజ్ ఉద్యోగి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, నార్త్ త్రిపురలో ని ఉనాకోటి సమీపంలో ని కుమార్ ఘాట్ ప్రాంతం లో ఈ ఘటన జరిగింది. ముందు జాగ్రత్తగా ఇద్దరు బాలికల ను అధికారులు హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. వారిని ఎవరూ కలవొద్దని సూచించారు. అయితే, క్వారంటైన్ లో ఉన్న అమ్మాయిల పట్ల అమానుషంగా అధికారి పై అందరూ మండిపడుతున్నారు..

 

 

 

ఇదే ప్రాంతానికి చెందిన పంచాయితీ రాజ్ ఉద్యోగి రిజబ్ కాంతిదేబ్, తనను తాను పారా మెడికల్ సిబ్బందిగా పరిచయం చేసుకుని వెళ్లి, వారి ఆరోగ్యాన్ని పరిశీలించాలంటూ చెప్పి, అసభ్యంగా ప్రవర్తించాడు. వారిద్దరి ఫోన్ నంబర్లనూ తీసుకుని, వారికి తరచూ ఫోన్ చేసి వేధింపుల కు గురి చేశాడు. దీంతో విసిగిపోయిన బాలికలు, విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న రిజబ్, ప్రస్తుతం పరారీలో ఉండగా, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. మరో  వైపు రిజబ్ పై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించామని బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇలాంటి వాళ్ళను వదలవద్దని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: