చెప్పేటివి శ్రీరంగ నీతులు, చేసేపనులు మాత్రం దొంగపనులు ఇలాంటి వారు సమాజంలో చాలా మందే ఉన్నారు.. బయటపడినప్పుడు మాత్రమే వారి నిజ స్వరూపం తెలుస్తుంది.. అప్పటి వరకు వారు గౌరవాన్ని పొందుతూనే ఉంటారు.. ఇలానే ఒక వ్యక్తి ప్రవర్తించాడు.. ఇతను సినిమాల్లో పోలీస్ వేషాలు వేసి, నిజ జీవితంలో మాత్రం దొంగగా మారాడు. నటన వేరు, జీవితం వేరు.. అందులో తెరపై దర్శకుని ఆలోచనలకు తగ్గట్లుగా, విలన్, హీరోలు, ఇలా మిగతా వారి వేషాలు ఉంటాయి.. తెరపై కూటికి లేని పేద హీరో కూడా కోట్లు కూడబెట్టి లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటాడు.. కానీ నిజ జీవితంలో ఇలాంటిది సాధ్యమా అంటే అసాధ్యమని చెప్పవచ్చూ..

 

 

అందుకే తెరమీద వచ్చే సన్నివేశాలను ఇన్స్‌ప్రేషన్‌గా తీసుకోకూడదు.. కానీ చాల మంది సినిమాల్లో లా రియల్ లైఫ్‌లో జీవించాలని ఆశపడి చివరికి ఎందుకు కొరగాకుండా పోతారు.. ఈ నటుడి విషయంలో ఇదే జరిగింది.. యూపీలోని లక్నో లో జరిగిన ఈ ఘటన తాలూకూ వివరాలు చూస్తే.. భారీ స్థాయిలో లక్సరీ కార్లు దొంగతనం చేసే ఓ ముఠాలోని నిందితుల్లో ఒకరు భోజ్ పూరి నటుడు నాసిర్ ఉన్నాడట. ఇక ఈ ముఠాను అరెస్ట్ చేసిన సందర్భంగా లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ పాండే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...నిందితుల వద్ద నుండి రూ. 5కోట్ల విలువైన 50కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

 

 

మొత్తం ఐదుగురు నిందితుల్లో ఒకరిని భోజ్ పూరి నటుడు నాసిర్ గా గుర్తించామని, ఇతను దాదాపు మూడు సినిమాల్లో పోలీస్ పాత్రలో కనిపించాడని అన్నారు. ఇకపోతే ముఠాలోని కొందరు సభ్యులు కార్లను దొంగిలిస్తే మరికొందరు వాటికి మరమత్తులు చేపించి విక్రయిస్తారని, ఈ నేపధ్యంలో ఈ ముఠా తమ అక్రమ కార్యకలాపాలను నేపాల్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ, హరియాణాతో సహా పలు రాష్ట్రాలలో కొనసాగించారని పోలీసు కమిషనర్ తెలిపారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: