మూడేళ్ల క్రితం ఇండియాకు చెందిన హిరేన్ అధియా, విధి అధియా తమ ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయ్ దేశానికి మకాం మార్చి అరేబియన్ రాంచెస్ నివసిస్తున్నారు. ఇండియాలో వాళ్లకి బంధువులు కూడా ఉన్నారు. హిరేన్ అధియాకు 45 సంవత్సరాలు ఉండగా విధి అధియాకు 40 సంవత్సరాలు ఉన్నాయి. అయితే జూన్ 18వ తేదీ అనగా గత గురువారం నాడు తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో వారు నివసించే అపార్ట్మెంట్ లో కి దొంగతనంగా ప్రవేశించిన ఒక పాకిస్తానీ దుండగుడు హిరేన్ ఇంటి తలుపులు తెరిచి చొరబడ్డాడు. ఆపై ఇంట్లోని వస్తువులను,నగదును దొంగలించడానికి ప్రయత్నిస్తుండగా... భారతీయ దంపతులు అతడిని అడ్డుకున్నారు. దాంతో ఆ పాకిస్తానీ దొంగ వాళ్ళిద్దరినీ అతి కిరాతకంగా హతమార్చి ఇంట్లో ఉన్న నగలను, నగదును దోచుకెళ్లాడు. 

 

IHG


మరుసటి రోజు ఉదయం ఈ సంఘటన వెలుగులోకి రాగా స్థానిక పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. ఆపై సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుకున్నారు. ఈ దారుణ సంఘటన లో చనిపోయిన ఇండియన్ కపుల్ గురించి దుబాయ్ లోని ఇండియన్ ఎంబసీ అధికారి అయిన విపుల్ కి తెలియజేశారు దుబాయ్ పోలీసులు. దీంతో అతడు భారతదేశ పోలీసులకు ఈ సమాచారం అందించగా మృతులు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. మరోవైపు దుబాయ్ పోలీసులు నిందితుడు చోరీ చేసిన నగలను, నగదును రికవరీ చేసుకున్నారు. ప్రస్తుతం దుబాయ్ పోలీసులు అతడిని కటకటాల లో పడేసి ఇలాంటి నేరాలు ఇంకా ఎన్ని చేశాడో అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 

 

IHG


ఏది ఏమైనా అన్యం పుణ్యం తెలియని భారతీయ దంపతులు ఒక పాకిస్తానీ దుండగుల చేతిలో అతి కిరాతకంగా హత్య చేయబడటం ప్రస్తుతం అందరిని బాగా కలిచివేస్తోంది. స్థానికంగా నివసించే కొంతమంది ప్రజలు మాట్లాడుతూ... హిరేన్ అధియా, విధి అధియా ఎప్పుడూ తలుపులకి తాళం వెయ్యరని, వాహనాలు పార్కింగ్ చేసే గ్యారేజీ కూడా లాక్ వెయ్యరని చెబుతున్నారు. ఒకవేళ వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ దారుణం జరిగి ఉండక పోయేది అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన మృతుల కుమార్తె ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతుంది. మృతుల స్నేహితులు ప్రస్తుతం ఇద్దరు పిల్లలను సంరక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: