మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒంటరిగా కనిపించే ప్రతి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు మానవ మృగాళ్లు. నిస్సహాయత గా వృద్ధులు కనిపించినా వారిని కిరాతకంగా చంపి ధనం దోచుకునేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఒకవైపు కరోనా ఉధృతి కారణంగా ఎంతోమంది చనిపోతుండగా మరోవైపు చెడ్డ వారి కారణంగా అన్యాయంగా చాలా ఉంది ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 50 ఏళ్ల వయసు పైబడిన ఒక మహిళను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా బట్టలు విప్పేసి ఆమెను చంపి పరారయ్యారు. 


పూర్తి వివరాలు తెలుసుకుంటే... హర్యానా రాష్ట్రం యమునా నగర్ జిల్లా రైల్వే కాలనీ లో ఉత్తర రైల్వే స్టేషన్ లో ఉద్యోగిగా పనిచేస్తున్న సరోజ్ బాల(55)ని తన ఇంట్లోనే మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చంపేశారు. రెండు రోజులుగా ఆమె ఫోన్ చేయక పోయేసరికి అనుమానం వచ్చిన బంధువులు ఆమె ఇంటికి వెళ్లగా... అప్పటికే అక్కడి స్థానిక ప్రజలు ఆ ఇంటి ముందు గుమిగూడారు. దాంతో బంధువులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా సామాన్లు మొత్తం చిందరవందరగా పడ్డాయి. ఆపై సరోజ్ బాల మృతదేహం అర్థనగ్నంగా ఫ్రిడ్జ్ పక్కన పడి ఉండటం బంధువులకు కనిపించింది. 


దీంతో ఫరక్ పూర్ పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు స్థానికులు. డాగ్ స్క్వాడ్ తో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సరోజ్ బాల మృతదేహంపై లోవస్త్రాలు తప్ప మిగతా దూస్తులేమీ లేవని తెలిపారు. చనిపోయిన మహిళ సరోజ బాల కు 55 సంవత్సరాలు ఉన్నాయని, ఆమె భర్త 2011వ సంవత్సరంలో చనిపోయాడు అని... అప్పటి నుండి ఆమె ఒంటరిగా నివసిస్తుందని పోలీసులు వెల్లడించారు. ఆమెపై అత్యాచారం జరిగిందా లేదా అనేది పోస్ట్ మార్టం నివేదికలో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: