సాధారణంగా భర్తలు చిత్రహింసలు పెడితే భార్యలు చ‌నిపోవ‌డ‌మో లేదా కోర్టు మెట్లు ఎక్క‌డ‌మో మ‌నం చూస్తుంటాం. ప్ర‌పంచ వ్యాప్తంగా స‌హ‌జంగా ఈ పురుషాధిక్య ప్ర‌పంచం భార్య‌ల‌ను భ‌ర్త‌లే ఎక్కువుగా టార్చ‌ర్ పెడుతూ ఉంటారు. అయితే ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జ‌రిగింది. భార్య పెట్టే భీభ‌త్స మైన టార్చ‌ర్ త‌ట్టుకోలేక ఓ భ‌ర్త ఏకంగా కోర్టును ఆశ్ర‌యించాడు. త‌న భార్య ప్ర‌వ‌ర్త‌న‌తో విగిసి పోయి చివ‌ర‌కు త‌న‌ను కాపాడాని కోర్టును ఆశ్ర‌యించాడు. ఈ వింత ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

 

కోల్ కతాకు చెందిన జ్యోతిర్మయి మజుందార్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. మ‌జుందార్ త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి కోల్‌క‌తా లో నివాసం ఉంటున్నాడు. క‌రోనా అక్క‌డ ఎక్కువుగా ఉండ‌డంతో మ‌జుందార్ త‌న త‌ల్లిదండ్రుల‌ను త‌న ఇంటికి తీసుకు వ‌చ్చాడు. అయితే ఇది భార్య‌కు ఇష్టం లేదు. వాళ్లు ఇంటికి వ‌స్తే మ‌న‌కు కూడా క‌రోనా సోకుతుంద‌ని చెప్పింది. అయినా అత‌డు మాత్రం త‌న తల్లిదండ్రుల‌ను ఇంటికి తీసుకు వ‌చ్చాడు. ఇది న‌చ్చ‌ని ఆమె భ‌ర్త‌కు టార్చ‌ర్ చూపించేసింది.

 

ప్ర‌తి రోజు చెంపదెబ్బలు కొట్టడం..పిన్నులతో గుచ్చడం.. సిగరెట్లతో కాల్చడం చేస్తుండేది. భార్య చిత్రహింసలు భరించలేక చివరకు జ్యోతిర్మయి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఈ కేసును ఏం చేయాలో తెలియ‌క ప‌ట్టించు కోలేదు. దీంతో మ‌జుందార్ కోల్‌క‌తా హైకోర్టును ఆశ్ర‌యించాడు. మ‌రి ఈ వింత సంఘ‌ట‌న‌లో కోర్టు ఏమ‌ని తీర్పు ఇస్తుందో ?  చూడాలి. ప్ర‌స్తుతం ఈ విష‌యం బెంగాల్‌లో బాగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అక్క‌డ మీడియా కూడా ఈ వార్త‌ను బాగా హైలెట్ చేసింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: