ప్రేమ పేరుతో ఈ తరం యువత ప్రలోభాలకు లోనవ్వడమే కాకుండా మోసాల ను, నేరాల ను చేస్తున్నారు. వారి శారీరక, వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ప్రేమిస్తున్నారు.. తీరా వారి అవసరాలు తీరిన తరువాత మొహం చాటేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలం లో చాలానే వెలుగు చూశాయి. తాజాగా మరో ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను అని నమ్మింది.. ఆ నమ్మకమే అతనికి క్యాష్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.. తన దగ్గర ఉన్నంత ప్రియుడికి సమర్పించింది.. అన్నీ పనులు అయ్యాక పెళ్లి మాట ఎత్త గానే అతను జెండా ఎత్తేశాడు..

 

 

వివరాల్లోకి వెళితే..కాకినాడకు చెందిన వెంకట సురేష్ కుమార్ కొద్దికాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతని కి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె ను ప్రేమిస్తున్నానని చెప్పి బుట్ట లో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె వద్ద నుంచి పెద్దమొత్తంలో డబ్బులు గుంజాడు. పెళ్లి చేసుకోబోయే వాడే కదా అని ఆమె అందినకాడికి అతనికి సమర్పించింది. తీరా పెళ్లి పేరెత్తగానే తప్పించుకు తిరగడం మొదలు పెట్టాడు. ముఖం చాటే స్తున్నాడని తెలుసుకున్న యువతి మోస పోయానని తెలుసుకుంది..

 

 


వెంటనే పోలీసుల ను ఆశ్రయించారు. సురేష్ కుమార్ తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేశాడని బాధితురాలు పోలీసుల కు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని.. అతని తో పెళ్లి చేయాలంటూ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న వారు సురేష్ ను గాలించి అదుపు లోకి తీసుకున్నారు.. అమ్మాయి దగ్గర తీసుకున్న మొత్తం తిరిగి ఇవ్వాలని,అలాగే ఆమె ను వివాహం చేసుకోవాలని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: