సోషల్ మీడియా ద్వారా చాలా మంది మంచిని నేర్చుకోవడం మాట పక్కన పెడితే.. లేని పోని విధంగా వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు..సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలకు ఎలా వల వేయాలని ఆలోచిస్తున్నారు. అంతేకాదు అమ్మాయిలను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా పడిన అమ్మాయిలకు మాయమాటలు చెప్పి డేటింగ్ పేరుతో సహజీవనం చేస్తున్నారట.. బెంగుళూరులో ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. 

 

 

వివరాల్లోకి వెళితే.. సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన బాలికను నమ్మించి సహజీవనానికి రెడీ అయిన హైదరాబాద్ యువకుడి ప్రయత్నం ఆఖరి నిమిషంలో బెడిచికొట్టింది. హైదరాబాద్‌లోని తన వద్దకు వచ్చేయాలంటూ ఆమె విమాన టిక్కెట్లు బుక్ చేసి మరీ పంపాడు. కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తండ్రి ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాను హ్యాక్‌ చేసి అసలు విషయం తెలుసుకున్నాడు. ఆఖరి నిమిషంలో విమానాశ్రయంలో తన కూతురిని అడ్డగించి యువకుడిపై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

 


బెంగళూరులోని ఉత్తరహల్లిలో ఉన్న ఏజీఎస్‌ లేఔట్‌ ప్రాంతానికి చెందిన బాలిక ఓ కార్పోరేట్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ కొనివ్వడంతో తరుచూ సోషల్‌మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి పోస్టులు చేస్తుండేది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌కు చెందిన విశాల్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. రోజూ ఛాటింగ్ చేసుకుంటూ ఇద్దరు దగ్గరయ్యారు. దీంతో ఆమె తన వ్యక్తిగత చిత్రాలు కూడా అతడికి పంపించింది.

 

 

 

కొద్దిరోజులుగా కూతురు ప్రవర్తనపై అనుమానపడుతూ వస్తున్న తండ్రి ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి చూడగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. విశాల్‌తో జరిపిన చాటింగ్, ఫోటోలు షేర్ చేసుకోవడం, విమాన టిక్కెట్లు పంపడం అన్ని విషయాలు తెలుసుకున్న తండ్రి వెంటనే ఎయిర్‌పోర్టు వెళ్లి చూడగా హైదరాబాద్ ఫ్లైట్ కోసం బాలిక వేచి చూస్తూ కనిపించింది. ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లిన తండ్రి 17వ తేదీన బెంగళూరులోని సీఈఎన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతని ఫిర్యాదు ను పరిగణలోకి తీసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: