ఎవరైనా పోలీస్ స్టేషన్ కు ఎందుకు వెళ్తారు...న్యాయం జరుగుతుందనే కదా..! మరి అలాంటి పోలీస్ స్టేషన్ లలో కూడా న్యాయం జరగపోతే ఎం చేస్తారు ? ఎక్కడికి వెళ్తారు ?  సమాజాన్ని రక్షించాల్సిన రక్షకులే భక్షకులుగా మారుతుంటే ఇక న్యాయం ఎక్కడ జరుగుద్ది. ఓ మహిళ తనకు సంబంధించిన భూ వివాదం పై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది.  సమస్యను తెలుసుకొని అండగా ఉండాల్సిన అక్కడి పోలీస్ అధికారి తన రూం లోకి పిలిపించుకుని ఆమె ముందే అసభ్యంగా ప్రవర్తించాడు. సాయం చేయాల్సిన పోలీస్ లే అలా చేయడం చూసి సహించలేని ఆ మహిళ అదంతా తన సెల్ ఫోన్ లో సీక్రెట్ గా చిత్రరేకరించింది.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

 


వివరాల్లోకి వెళ్తే... డియోరియాలోని భట్ని  కు చెందిన ఓ మహిళ భూ వివాదం గురించి ఫిర్యాదు చేయడానికి భట్ని పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. కంప్లైంట్ తీసుకుంటామని వివాదానికి సంబంధించిన వివరాలు చెప్పాలని ఆ ఎస్.ఐ  భీష్మా పాల్ ఆమెను తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆమె ముందే అసభ్యకరంగా హస్తప్రయోగం చేసాడు. ఇలా ఒక్కసారే కాదు అంతకుముందు ఒకటి రెండు సార్లు ఫిర్యాదు చేయడానికి వస్తే ఇలాగే చేశాడని సదరు మహిళ వాపోయింది.

 

 

 

అయితే ఇదంతా ఆమె తెలివిగా సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేసింది. ఇక ఆలోచించకుండా జరిగిందంతా చెప్తూ ఆ విడియో ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దానిపై ఆమె  మాట్లాడుతూ.. ‘భూ సమస్య పరిష్కారం కోసం నేను ఇప్పటికి పలుమార్లు ఈ పోలీసు స్టేషన్‌కు వచ్చాను. గతంలో 2, 3 సార్లు ఆ ఎస్సై ఇలానే ప్రవర్తించాడు. దీని గురించి నా స్నేహితురాలికి చెప్పాను. అప్పుడు ఆమె గతంలో భీష్మ్‌ పాల్‌ సింగ్‌ తన ముందు కూడా ఇలానే ప్రవర్తించాడని చెప్పింది. అందుకే ఈ సారి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినప్పడు సీక్రెట్‌ కెమరా తీసుకెళ్లాను. అతడి నీచ బుద్ధిని అందరికి తెలియజేయాలని వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాను’ అంది. అయితే ఇదంతా పై స్థాయి అధికారుల వరకూ చేరడంతో సదరు ఎస్సై ను సస్పెండ్ చేసారు. ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సదరు మహిళ తెలివిగా ఎస్సై గుట్టు బయటపెట్టడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: