మెక్సికోలోని ఓ డ్రగ్​ రిహాబిలిటేషన్​ కేంద్రంలో దుండగులు తుపాకులతో విరుచుకుపడ్డారు. అందులో ఉన్న అందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. 24 మంది మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.మెక్సికోలో కొంతమంది దుండగులు మారణహోమం సృష్టించారు. గువానాహువాటో రాష్ట్రం ఇరాపూవాటోలోని ఓ డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రంలో జరిగిన కాల్పుల్లో 24 మంది మరణించారు. ఏడుగురు గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

 

 

రిహాబిలిటేషన్ కేంద్రంలోని అందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కేంద్రంలోని దృశ్యాలు రక్తసిక్తమైన యుద్ధభూమిని తలపిస్తోందని ఓ అధికారి అన్నారు.ఈ ఘటన వెనుక కారణాలు తెలియరాలేదని, స్థానిక డ్రగ్​ సరఫరాదారుల ముఠాకు సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.నెల రోజులుగా నగరంలో ఇది రెండవ ఘటన అని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కాల్పుల్లో పోలీసులు సైతం గాయాల పాలయ్యారు.మెక్సికో అధ్యక్షుడిగా ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ 19 నెలల క్రితం అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో ఇలాంటి దాడుల సంఖ్య కాస్త తగ్గింది. కానీ ఇప్పుడు మరోసారి వరుస దాడులు జరుగుతన్నాయి. తాజాగా జరిగిన కాల్పుల ఘటన 2020లో ఏడాదిలో అతి పెద్ద నరమేధంగా అక్కడి వారు భావిస్తున్నారు.

 

 

ఇలాంటి ఘటనలు పాశ్చాత్య దేశాలలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ఇలాంటి దారుణాలు అన్ని జరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్కరు చేతిలో తుపాకీ ఉండడం సాధారణ విషయంగా మారిపోయింది. అక్కడ సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే ఒంటరిగా బయటికి రావడానికి కొన్ని ప్రదేశాలలో చాలా ధైర్యం చేయాల్సిందే. అలాంటి సందర్భాల్లోనే చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మనం రోజు వార్తలలో చూస్తూనే ఉంటాం తెలుగు విద్యార్థి అమెరికాలో మరణం. లేదా తెలుగు జంట అమెరికాలో కాల్పుల్లో దారుణ హత్య..ఈ విధంగా ఎన్నో కుటుంబాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇలాంటివి ఎప్పుడు అవుతాయి సామాన్య మానవుని అర్థం కావడం లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: