విద్యార్థుల కు మంచి బుద్దులు నేర్పించే బాధ్యత కలిగిన విద్యావేత్త పదవిలో ఉన్న ఓ మాస్టర్ వేరే ప్రొఫెసర్‌ తో రాస లీలలు చేస్తూ సుఖాన్ని అను భవించేవాడు.. మహిళతో అక్రమ సంబంధం పెట్టు కోవడమే కాకుండా... ఆ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్‌ మీడియా లో పోస్ట్ చేశారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో అతడి పై కేసు నమోదు చేసి కట కటాల్లోకి నెట్టారు. ఈ ఘటన అస్సాం లోని దిబ్రూఘడ్ నగరం లో వెలుగు చూసింది. ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నా కూడా ఈ ప్రబుద్ధులు ఇలా చేయడం పై పలువురు చెవులు కొరుక్కుంటున్నారు..

 

 

అసలు విషయాని కొస్తే.. బార్పేట జిల్లా లోని పాఠశాల అనే గ్రామానికి చెందిన ద్రుభజీత్ చౌదరి దిబ్రూఘడ్ యూనివర్శిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసరు గా పని చేస్తున్నాడు. ఓ మహిళ తో పడక గదిలో ఏకాంతంగా గడిపి వీడియోను ఇటీవల ఆయన సోషల్ ‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రొఫెసర్ నిర్వాకంపై అనేక మంది మండిపడ్డారు. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారి పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ కీచక ప్రొఫెసర్‌ని అరెస్ట్ చేశారు.

 

 

అంతే కాకుండా అతడి ఇంటి నుంచి కంపాక్ట్ డిస్క్, ల్యాప్ ‌టాప్, మొబైల్‌ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోను తాను మూడేళ్ల క్రితం రికార్డ్ చేసినట్లు నిందితుడు విచారణ లో వెల్లడించినట్లు దిబ్రూఘడ్ డీఎస్పీ శ్రీజిత్ తెలిపారు. మరో వైపు గౌరవ ప్రదమైన ఉద్యోగం లో ఉంటూ ఇంతటి నీచానికి పాల్పడిన ప్రొఫెసర్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దిబ్రూఘడ్ యూనివర్శిటీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.. ఇలాంటి ప్రొఫెసర్ లను ఏ కాలేజీలో పనిచేయనియకుండా చేయాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: