ఎవరూ లేని సమయంలో మూడు నెలల గర్భిణీ అయిన మౌనిక ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కి  ఉరేసుకుని  ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం పై రోధిస్తున్నారు. అయితే దీనికి కారణం ఏమిటి అన్నది ఇంకా కుటుంబ సభ్యులకి తెలియలేదు. వివరాల్లోకెళ్తే విజయనగరం జిల్లా డెంకాడ మండలం మొదవలస పంచాయతీ కొండయ్య పాలెం లో మౌనిక అనే వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మౌనికకి  కేవలం 21 సంవత్సరాలు.

 

ఆమె కొండయ్య పాలానికి చెందిన గౌరయ్య అనే యువకుడి తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఆమె ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన మేనకోడలు కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు విజయనగరం లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న మౌనిక అదే రోజు ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన నిజంగా తీవ్ర విషాదం నింపింది. ఈ విషయం తెలుసుకున్న డెంకాడ ఎస్ఐ సాగర్ బాబు సోమవారం కుటుంబ సభ్యులుని విచారించారు .

 

అయితే వాళ్ల భార్య భర్తల మధ్య ఎలాంటి సమస్య లేదని వాళ్ళ కాపురం అంతా బాగుందని పోలీసులకు తెలిపారు. కుటుంబ సభ్యులంతా  మౌనిక ఆత్మహత్యకు కారణం ఏమిటో తెలియదు అని చెప్పారు. అయితే పోలీసులు తహసిల్దారు చంద్రమౌళి సమక్షంలో సోమవారం శవ పంచనామా నిర్వహించి మృతదేహానికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మూడు నెలల గర్భిణీ నిండు ప్రాణాలు విడవడం అందర్నీ బాధిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: