సోషల్ మీడియా లో ప్రపంచం లో జరిగే వాటిని తెలుసుకోవడం ఒకప్పుడు యువత చేసే పనులు.. కానీ ఇప్పుడు యువత సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ఎలా పెట్టుకోవాలి.. వారితో ఎలా ప్రేమను తెలపాలి అని చూసేవాళ్ళు ..కానీ ఈ మధ్య కాలంలో ఇంకాస్త బెటర్ గా ఆలోచిస్తున్నారు.. అదేంటంటే తమకు నచ్చిన అమ్మాయిలను గుట్టు చాటుగా ఫోటోలను తీసి వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు.. 

 

 

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో మరో కీచకపర్వం వెలుగుచూసింది. మైనర్ బాలిక నగ్నచిత్రాలతో వేధింపులకు గురిచేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. అమ్మాయి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. మైనర్ బాలిక నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శుభం అనే యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.గతంలో ఇలానే గుంటూరులో ఓ ఘటన వెలుగు చూసింది..

 

 

ప్రేమపేరుతో యువతిని లోబరుచుకుని.. రేప్ చేస్తూ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిందితులను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపారు. ఆ దారుణ ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.తాజాగా జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. యువతితో స్నేహం నటించిన కేటుగాడు ఆమె సోదరి నగ్న చిత్రాలు సంపాదించి బ్లాక్‌మెయిల్‌కి పాల్పడినట్లు తెలుస్తోంది. నగ్న చిత్రాలను బాలికకు పంపి వేధింపులకు గురిచేశాడు. అనంతరం ఆమె ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో నగ్న చిత్రాలు పెట్టినట్లు తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: