అందరికీ కష్ట కాలాన్ని అందించింది కరోనా. ప్రతి ఒక్కరు కూడా ఈ మహమ్మారి తో బాధిస్తున్నారు. బతుకు ఈదలేక  దుఖం తో నిండి పోయారు. అయితే స్వయం ఉపాధి పొందేందుకు యువకుడు ఫైనాన్స్ లో ఆటో కొనుక్కుని జీవనం సాగిస్తున్నాడు. ఏదో బ్రతుకుని నెడుతుంటే ఇంతలో ఈ మహమ్మారి అతని బతుకుని ధ్వంసం చేసింది. ఈ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఎంతో మంది ప్రాణాలను రోడ్డు పాలు చేసింది. ఉపాధి కోల్పోయి, ఉద్యోగాలు లేక దేశంలో లక్షలాది మంది దిక్కు తోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు.

 

రోజూ ఏదో కొంత డబ్బు సంపాదించుకునే వాళ్ళ బతుకులు కరోనాతో అల్లకల్లోలం అయిపోయాయి. తినడానికి తిండి లేక అద్దె కట్టుకో లేక ఏం చేయాలో తెలియక అఘాయిత్యానికి పాల్పడ్డారు. కరోనా కాటుకి బలై పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇలాంటి విషాద ఘటన మరొకటి జరిగింది. వివరాల్లోకి వెళితే కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఒక ఆటో డ్రైవర్ డబ్బులు చెల్లించ లేక ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన గడ్డం శ్రీకాంత్ 22 సంవత్సరాలు వయసు వాడు.

 

ఇటీవల ఫైనాన్స్ తీసుకుని ఆటో కొనుక్కుని జీవనం సాగిస్తున్నాడు. అంతా బాగుంది అనేసరికి కరోనా లాక్ డౌన్ రావడం ఆటో నడపలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో ఉపాధి కోల్పోయాడు. ఆటో కోసం తీసుకున్న డబ్బులు కూడా చెల్లించలేక పోయాడు డబ్బులు చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు శ్రీకాంత్ ని ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంక ఏమీ చేయలేక ఇబ్బందులతో సతమతమయ్యాడు. బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఒకనాడు సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాల్ని తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: