కరోనా ను మించిన రేంజు లో మహా నగరాల్లో కామాంధులు తిరుగుతున్నారు.. కంటికి కనిపించిన ఆడదాన్ని బలవంతం గా ఎత్తుకెళ్లి కామ వాంఛలు తీర్చుకుంటున్నారు.. వీధిలో ఉండే కుక్క కూడా అలా ప్రవర్తించదేమో అంతలా ఇలా మృగాళ్లు ఆడవాళ్ల పై అఘాయిత్యాల కు పాల్పడుతున్నారు. అసలు విషయానికొస్తే హైదరాబాద్ మహానగరంలో ఆడవాళ్ల పై అఘాయిత్యాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. మద్యం సేవించి ఇంట్లో నిద్ర పోతున్న ఓ వివాహితను బలవంతం గా ఎత్తుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించారు.. 

 

 

వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన హైదరాబాద్ ‌లో జరిగింది. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్ పరిధి లోని రహమత్‌నగర్ ప్రాంతం లో దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సోమవారం అర్ధరాత్రి కుటుంబమంతా ఇంట్లో నిద్రపోతున్న సమయం లో స్థానికంగా ఉండే ఇద్దరు యువకులు మద్యం మత్తు లో తలుపులు తట్టారు. ఆమె తలుపు తీయగానే జుట్టు పట్టుకుని బయటకు లాగి మరో ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేయబోయారు.ఆమె గట్టిగా కేకలు వేయడంతో వారి విషయం అందరికీ తెలిసింది..

 

 


ఒకడు ఆమెపై పడి పశువులా ప్రవర్తించడగా మరొకడు దాన్ని సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అడ్డగించేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు విన్న స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఘటన స్థలానికి చేరుకున్నారు. వారి చెర నుంచి ఆమెను రక్షించడానికి శత విధాలుగా ప్రయత్నించారు.. అయిన వారు వచ్చిన వారిపై దాడికి దిగడంతో భయపడిన స్థానికులు వెంటనే  సమాచారాన్ని పోలీసులకు అందించారు..వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాంటి కామాంధుల వదిలిపెట్ట కూడదని స్థానికులు పోలీసులకు విన్నవించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: