ప్రకాశంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుకి అడ్డంగా పాము రావడంతో రైతు కంగారు పడి మృతి చెందాడు. మట్టి తోలుతుండగా రోడ్డుకి అడ్డంగా పాము వచ్చింది. దీంతో రైతు రమేష్ రెడ్డి బాగా కంగారు పడి పోయాడు . అయితే తొందరలో ట్రాక్టర్లు పక్కకు తప్పించబోయాడు. అమాంతం ట్రాక్టర్ తిరగబడింది దీనితో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు . నిజంగా ఇది ఘోరం అనే చెప్పాలి

 

వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పరిధి లో తాళ్లూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి రాత్రి సమయం లో ట్రాక్టర్ లో  మట్టిని తరలిస్తున్నారు . అయితే పశువుల కొట్టం నుండి ట్రాక్టర్ లో  వెళ్తుండగా తనకి పెద్ద పాము రోడ్డుకి అడ్డంగా కనిపించింది. దానితో కంగారు పడి పోయాడు రమేష్ రెడ్డి. అయితే ఈ పాముని తప్పించడానికి ప్రయత్నం చేశాడు.

 

ఈ ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా పడింది. అతనిపై ట్రాక్టర్ పడి పోవడంతో తీవ్ర గాయాలయ్యాయి . వెంటనే వచ్చిన స్థానికులు కుటుంబ సభ్యులు రమేష్ రెడ్డిని ఒంగోలు ఆస్పత్రికి తీసుకెళ్లారు . కాని పరిస్థితి విషమించడంతో గుంటూరు హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. పాముని తప్పించడానికి చూస్తే ప్రాణాలే పోయాయి.

 

కేవలం 31 సంవత్సరాలు అయిన రైతు ప్రాణాలు కోల్పోయిన వార్త  స్థానికులని , కుటుంబ సభ్యులుని బాధించింది. అనుకోకుండా ట్రాక్టర్ బోల్తా పడడం రమేష్ రెడ్డి  గాయాల పాలవ్వడం కుటుంబ సభ్యులను తీవ్ర కలవరం రేపింది . ఈ విషాదంని పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృత దేహాన్ని అప్పగించారు స్థానిక పోలీసులు . 

మరింత సమాచారం తెలుసుకోండి: