ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు రాజ‌కీయ దుమారం.. ఇంకా చ‌ల్లార‌లేదు. ఆయ‌నకు టికెట్ ఇచ్చిన పార్టీకే ఆయ‌న సున్నం రాస్తున్నార‌ని ఏపీలోని గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు కూడా రాజ‌కీయ నాయ‌కులు చెవులు కొరుక్కొంటున్నారు. జిల్లాపై ఆధిప‌త్యం విష‌యంలో త‌లెత్తిన వివాదం.. ఏకంగా పార్టీ గుర్తింపును ప్ర‌శ్నించే వ‌ర‌కు వెళ్లింది. ఇంత వ‌ర‌కు వైసీపీ వ‌ర్సెస్ ఎంపీ రాజుగారి విష‌యం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న పార్టీ గుర్తింపునే ప్ర‌శ్నించ‌డం, పార్టీ మేనిఫెస్టోనే రాజ్యాంగ విరుద్ధ‌మ‌నేలా ప్ర‌శ్న‌లు సంధించ‌డం వంటివి వైసీపీలో నే కాకుండా ఇత‌ర ప‌క్షాల నేత‌ల మ‌ధ్య కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నా యి.  ఏదైనా.. ప‌క్కిల్లు త‌గ‌ల‌బ‌డుతుంటే.,. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు ఎంత స‌మ్మ‌గా ఉంటుందో తెలియంది కాదుక‌దా!?


ఇక‌, తాజా విష‌యానికి వ‌స్తే.. ఎంపీ రాజుగారు.. వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి త‌న‌కు పంపిన షోకాజ్ నోటీసుకు స‌మాధానంగా.. ఆరు పేజీల సంజాయిషీని నేరుగా సీఎం జ‌గ‌న్‌కు పంపించారు. వాస్త‌వా నికి ఇది అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం. కానీ, రాజుగారే దీనిని ప‌బ్లిక్ వ్య‌వ‌హారం చేయ‌డం.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు,  తాజాగా ఆయ‌న పంపిన ఆరుపేజీల ఉత్త‌రానికి మ‌ధ్య సాప‌త్యం లేక‌పోవ‌డంతో వైసీపీ నేత‌ల మాట అలా ఉంచితే.. నిన్న‌టి వ‌ర‌కు రాజుగారు వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య సాగుతున్న పెనుగులాట‌ను చూసి ఆనందించిన టీడీపీ త‌మ్ముళ్లు చెవులు కొరుక్కొంటున్నారు. ``అదేంటి బెద‌రూ.. రాజుగారు నిన్న‌టి వ‌రకు గంభీరంగా ఉన్నారు.. ఇప్పుడు ఒక్క‌సారిగా ఇలా చేశారేంటి?`` అని చెవిలో చిన్న‌గా చెప్పుకొంటున్నారు. 


``అరె.. సాయిరెడ్డి పంపించిన షోకాజ్ నోటీసును అస‌లు నోటీసే కాద‌న్నాడు. అస‌లు వేరే పార్టీ లెట‌ర్ హె డ్‌పై త‌న‌కు ఎలా నోటీసు ఇస్తార‌ని రాజుగారు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అంతేకాదు,తాను లోక్‌స‌భ స భ్యుడిని.. ఠాట్‌! ఓ రాజ్య‌స‌భ స‌భ్యుడు త‌న‌కు నోటీసివ్వ‌డ‌మేంటి.. అన్నాడు. ఇక్క‌డితో ఆగ‌కుండా..  అసలు ప్రాంతీయ పార్టీల‌కు జాతీయ కార్య‌ద‌ర్శులు ఉంటారా? అనే లాపాయింట్ లాగాడు. దీంతో మ‌నంద‌రం.. వైసీపీని భ‌లే ఇరుకున పెట్టాడు.. జ‌గ‌న్ అండ్‌కోకి చుక్క‌లు చూపించాడు.. అని చంక‌లు గుద్దుకుంటుంటే.. ఇప్పుడేంటి బ‌ద‌రూ ఇలా చేశాడు!`` అని టీడీపీ త‌మ్ముళ్లు.. చెవిలో చిన్న‌మాట‌గా చెప్పుకొంటున్నారు. 


మ‌రో అడుగు ముందుకు వేసి.. ``రాజుగారు ఇప్ప‌టి వ‌ర‌కు బాగానే రియా క్ట్ అయ్యారు. కానీ, ఇప్పుడు ఏకం గా బొక్క‌బోర్లా ప‌డ్డారు!`` అని చెప్పుకొంటున్నారు. ``లేక‌పోతే.. ఏంటి బెద‌రూ.. రాజుగారే చెప్పారు క‌దా.. త‌న‌కు పంపించిన షోకాజ్ నోటీసుకు అర్ధం లేద‌ని, ఆయ‌న అన్నారు క‌దా.. సాయిరెడ్డి ఎవ‌రు? న‌న్ను ప్ర‌శ్నించ‌డానికి? అని! అస‌లు వైఎస్సార్ పార్టీ జ‌గ‌న్‌ది కాదు.. అని కూడా అనేశారుక‌దా? మ‌రి ఇన్ని లా పాయింట్లు లాగిన రాజుగారు.. అస‌లు దీనికి స‌మాధానం ఎందుకు పంపారు?  ఆ మాత్రం లాజిక్కు తెలీలేదా?  నిజంగానే ఆయ‌న చెప్పిన మాట‌లు నిజ‌మైతే.. స‌ద‌రు షోకాజ్‌కు ఆయ‌న స్పందించ‌కుండా ఉండి ఉండాలి. 

నిఖార్స‌యిన నాయ‌కుడైతే.. సాయిరెడ్డి పంపించింది చెల్లుబాటు కాన‌ప్పుడు ఆరు పేజీల లెట‌ర్ ఎందుకు రాయాలి?  కానీ, ఆయ‌న ఎక్క‌డో భయ‌ప‌డుతున్నారు.. మ‌న‌సులో గిలి ఉంది.. త‌ప్పు చేస్తున్నాన‌నే బాధ కూడా ఉంది.. అందుకే ఆరు పేజీల లెట‌ర్ రాశాడు..``- అని టీడీపీ నాయ‌కులు చెవులు చిల్లులు ప‌డేలా చ‌ర్చించుకుంటున్నారు. మొత్తానికి వైసీపీలో ఏర్ప‌డిన తుఫాను.. టీడీపీలోనూ ప్ర‌భావం చూపిస్తోంద‌న్న మాట‌!!  

మరింత సమాచారం తెలుసుకోండి: