అవును! ఇప్పుడు అంతా మ‌న‌చేతుల్లోనే ఉంది. మ‌న చేత‌ల్లోనే ఉంది. మ‌న‌దే నిర్ణ‌యం.. అది మంచిదై నా.. చెడ్డ‌దైనా.. అంతిమంగా మ‌న‌మే బాధ్యులం. ఇప్పుడు అంతా మ‌నల్ని బ‌ట్టే మ‌న ఇల్లు.. మ‌న స‌మా జం.. మ ‌న‌ రాష్ట్రం.. ‌చివ‌రాఖ‌రుకు మ‌న దేశం! మొత్తంగా ఇప్పుడు ప్ర‌పంచాన్ని కుమ్మేస్తున్న క‌రోనా మ హ‌మ్మారి విష ‌యంలో ప్ర‌భుత్వాలు చేయాల్సింది ఏమీలేద‌నే విష‌యం తేలిపోయింది. ప్ర‌భుత్వాలు పూర్తిగా చేతులు ఎత్తే శాయ‌నే విష‌యం అర్ద‌మైపోయింది. దీంతో ఇప్పుడు అంతా మ‌న చేతుల్లోకి వ‌చ్చే సింది. కరోనా నియం త్ర‌ణే త‌ప్ప‌.. నివార‌ణ లేని ప్ర‌మాద‌క‌ర వైర‌స్ కావ‌డంతో ప్ర‌పంచం అంతా కూడా హ‌డ‌లి పోతున్న విష‌యం తెలి సిందే. 


ఎక్క‌డో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో న‌వంబ‌రులో వెలుగు చూసిన‌.. ఈ వైర‌స్‌.. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ సు ప‌రి చిత‌మైపోయింది. నువ్వు-నేను-కులం-మతం-ప్రాంతం-వ‌ర్ణం-చిన్న‌-పెద్ద‌-ప్రొటోకాల్ వంటివి దా నికే మీ తెలి య‌దు.. లేవుకూడా! ప్రాణాంత‌క వైర‌స్ అయిన కొవిడ్‌-19పై మ‌న దేశంలో ముందు శ‌త‌ఘ్నులు పేలుస్తామం టూ.. ప్ర‌భుత్వాలు.. స‌మ‌ర శంఖం పూరించాయి. లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి. ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌కే ప‌రిమితం చేశా యి. ప‌నులు నిలిపేశాయి.. టాఠ్‌!! వైర‌స్‌ను లొంగ‌దీసేద్దాం.. అంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికా యి. ``సెప్తె.. ఇన‌కుం టె ఏం సేస్తాం.. మిల‌టీరీని దింపాల్నా!``- అంటూ.. సీఎంలు ప్ర‌జ‌లపై ఆగ్ర‌హాలు వెళ్ల‌గ‌క్కారు. దీంతో చ‌డీ చ‌ప్పుడులేకుండానే ప్ర‌జ‌లు ఇళ్ల‌కు ప‌రిమిత‌మ‌య్యాయి!


ఇంత‌లో ఢమాల్‌! ఢ‌మాల్‌!! స్టాకు మార్కెట్లు కుప్ప‌కూలాయి. రాష్ట్రాలు బొచ్చెలు ప‌ట్టుకుని ఢిల్లీ మోదీషా వారి కొలువు ముందు మోక‌రిల్లాయి. దీంతో మోదీవారు మందు అమ్మ‌కాల‌కు ముందు ఓకే చెప్పారు. దీంతో రాష్ట్రాల క‌రోనా ప‌ట్టు స‌డ‌లిపోయింది. లాక్‌డౌన్‌లో ఆంక్ష‌లు స‌డ‌లిపోయాయి. బింకాలు త‌గ్గిపోయాయి. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌బుత్వాల ప‌ట్టును, బెట్టును ఒకింత గ‌మ‌నించిన వైర‌స్‌.. త‌న వేగాన్ని కొంత త‌గ్గించింది.. శ‌త్రువు పోరాటం చేసే స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థి బ‌లం త‌గ్గేవ‌ర‌కు వేచి చూసిన‌ట్టుగా.. క‌రోనా కూడా భార‌త దేశ ప్ర‌భుత్వాల శూర‌త్వం అంతా బీర‌త్వంగా అయ్యేవ‌ర‌కు వేచి  చూసింది. తీరా నోటు లేక ఓటిపోతున్న ఖ‌జానాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌ను ఎత్తేయ‌డం, ప్ర‌జ‌ల మ‌ధ్య దూరం త‌గ్గ‌డంతో క‌రోనా కోరులు విప్పింది. 


``అరె! మ‌న ద‌గ్గ‌ర ప‌దివేల మ‌ర‌ణాలా?  అంత‌దాకా రానిస్తే.. మోడీనే కాదు!!``-అంటూ ఏప్రిల్ తొలివారం లో కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు మోడీ వారి భ‌జ‌న కార్య‌క్ర‌మంలో ప‌లికిన చిల‌క‌ప‌లుకులు .. ఇప్పుడు వినిపిం చ‌డం లేదు. 18 వేల మంది మ‌ర‌ణించారు. ల‌క్ష‌ల్లో క‌రోనా బాధితులు ఆసుప‌త్రుల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. ఈ తీవ్రత ఇంకా పెర‌గ‌డ‌మే కానీ,త‌గ్గేది లేదు. ఈ నేప‌థ్యంలో ఏం చేయాలి? మ‌ళ్లీ లాక్‌డౌన్‌?!  అయితే, ఖ‌జానా ప‌రిస్థితి ఏంటి?  అందుకే .. మొత్తంగా కేంద్రంలో మోడీ వారు.. ప్ర‌జ‌ల‌కు మూడేలా నాలుగు మాట‌లు చెప్పి.. క‌రోనా బాధ్య‌త‌ను ప్ర‌జ‌ల నెత్తిన మోపేశారు.. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను మొపిన‌ట్టు!! సో.. మాస్కులు, భౌతిక దూరాలు ఖ‌చ్చితం.. రిక్షాలాగే వాడి నుంచి రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు కూడా మాస్కులు ధ‌రించాల‌ని చెప్పారు మోడీ.. అంతే త‌ప్ప‌.. ప్ర‌జ‌ల‌ను ఏ విధంగా గ‌ట్టెక్కించాలో ఆయ‌న చెప్ప‌లేక పోయారు. 


మొత్తంగా.. ఈ స‌మ‌స్య‌ను ఇప్పుడు ప్ర‌జాకోర్టులోకే నెట్టేశారు మోడీ. మాస్కులు ధ‌రించాల‌ని చెప్పారు. భౌ తిక దూరం పాటించాల‌న్నారు. అంటే.. మొత్తంగా ఇప్పుడు మ‌న‌దే బాధ్య‌త‌! మ‌రి మ‌నం సైనికులుగా క్ర ‌మ‌శిక్ష‌ణ‌తో మెలిగి క‌రోనా భూతం నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుందామా?  లేక‌.. క‌రోనా దృష్టిలో మనం శ‌త్రువులుగా మారి దానికి బ‌లైపోదామా? అన్న‌ది మ‌న‌మే ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. బాధ్య‌త అనేది ఎవ‌రో మ‌న నెత్తిన పెడితే వ‌స్తుంద‌ని భావించే క‌న్నా.. ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌త బాధ్య‌త తీసుకునేందుకు సిద్ధ‌మ‌వ్వాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ విష‌యం ప్ర‌భుత్వాల‌ను తిట్టుకుంటూ.. చేతులు క‌లుపుకొనే కంటే.. ఎవ‌రికి వారు దూరం పాటిస్తూ.. మ‌న ప‌ని మ‌నం చేసుకుంటేనే.. ప్ర‌భుత్వాలు ప‌ని చేస్తాయ‌నే స‌త్యం తెలుసుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: