వైసీపీ నేత‌ల ఫోన్లు.. మార్మోగుతున్నాయ్‌! ``ఏంటీ.. మన బాసు.. ముల్లును ముల్లుతోనే తీస్తున్నాడంట‌గా!  నిజ‌మేనా?``- అంటూ.. నైత‌లు చెవులు కొరికేసుకుంటున్నారు. చెవిలో చిన్న‌మాట అంటూ.. మ‌ళ్లీ న‌ర‌సాపు రం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్య‌వ‌హారాన్ని మాట్లాడుకుంటున్నారు. నిజానికి గ‌డిచిన రెండు వారాలుగా మీడియాలో ఈయ‌నగారి గురించి రాని వార్త‌లేదు. ఆయ‌న చెప్ప‌ని గ్యాసిప్ లేదు. అదేస‌మ‌యంలో ఆయ‌న ను రాజ‌కీయంగా వాడుకోని ఛాన‌ల్ కూడా లేదు. ఇక‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు బాగా మేత కూడా ఇచ్చిన స‌బ్జెక్ట్ ఇదే! అయితే, ఇన్నాళ్లుగా వినీవినీ.. ఇన్నాళ్లుగా చూసీ చూసీ.. ప్ర‌జ‌ల‌కు బోర్ కొట్టేసింది. 


దీంతో దాదాపు రాజుగారి విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌డం మానేశారు. కానీ, ఇప్పుడు హ‌ఠాత్తుగా ఎల్లో మీడియా లో ఒక స్టోరీ వ‌చ్చింది. ఇది ఒక్క‌సారిగా మ‌ళ్లీ రాజాగారి న్యూస్‌ని హైప్ చేసేసింది. దీంతో ఈ విష‌యాన్ని వైసీపీ నాయ‌కులు చెవిలో చిన్న‌మాటగా చెప్పుకొంటున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఇస్తూ... పార్టీ ఉనికినే సవాలు చేస్తూ.. కొత్త లాజిక్కులు లేవనెత్తుతున్న ఎంపీ రఘురామ కృ ష్ణం రాజుపై చర్యలు తీసుకునే విషయమై వైసీపీలో తర్జనభర్జనలు జరుగుతున్న మాట వాస్త‌వం. ర‌ఘుపై అగ్గిమీద‌గుగ్గిలంలా మండుతున్న ప‌శ్చిమ గోదావ‌రి వైసీపీ నేత‌లు.. ఆయ‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రిం చాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విష‌యం కూడా ర‌గులుతూనే ఉంది. 


పౌరుషానికి ప్ర‌తీక అయిన రాజుల‌కు రాజ‌కీయాల్లోనూ అలాంటి ప‌ట్టింపులే ఉంటాయి. సో.. త‌మ‌ను రోడ్డు కులాగిన ర‌ఘురామ‌కృష్ణం రాజుపై అంతేక‌సితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌నను పార్టీ నుంచి బయ‌ట‌కు పంపేయాల‌నే ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే, ఈ విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆచితూచి వ్య‌వ‌హ‌రి స్తున్నారు. దీనికి కార‌ణం.. ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌న మ‌న‌వ‌డికి వైఎస్ పేరు పెట్టుకోవ‌డ‌మేన‌ని తెలుస్తోం ది. దీంతో జ‌గ‌న్ అన్ని విధాలా ఆచితూచి అడుగులు వేస్తున్నార‌ని చెబుతున్నారు. కానీ, ర‌ఘు మాత్రం.. ‘షోకాజ్‌కు సమాధానం కాదు’ అంటూనే... తనకు అందిన నోటీసులోని అంశాలను ప్రస్తావిస్తూ జగన్‌కు రాసిన లేఖ తీవ్ర వివాదానికి దారితీసింది. 


వాతావరణాన్ని వేడెక్కించారు. తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఇదివరకే కేంద్రాన్ని కోరా రు. లోక్‌సభ స్పీకర్‌కూ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోకుండా వదిలేస్తే... ము న్ముందు మరికొందరు అదే బాటలో నడిచే ప్రమాదముందని వైసీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నా రు. అలాగ‌ని.. ప్రాథమికంగా రఘురామ కృష్ణంరాజును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే ఆయనకు మ‌రిన‌ని ఆయుధాలు ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో.. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను ఆధారంగా చూపిస్తూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలపై న్యాయ, రాజ్యాంగ నిపుణుల తో పార్టీ సీనియర్‌ నేతలు చర్చిస్తున్నారు. 


ఎంపీ రఘురామ లేఖలనే ఆధారంగా చేసుకుని.. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా లోక్‌సభ స్పీక ర్‌ను కోరాలని వైసీపీ నిర్ణయించింది. ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరించాలని భావిస్తోంది. నిజానికి ఇదే జ‌రిగితే.. ఎంపీ ర‌ఘుకు గ‌ట్టిగానే షాక్ ఇచ్చిన‌ట్టు అవుతుంది. దీంతో ఈ విష‌యం వెలుగు లోకి రాగానే.. వై సీపీ నాయ‌కులు చెవిలో చిన్న‌మాటగా.. ముల్లును ముల్లుతోనే తీస్తారంట‌గా!! అంటూ చ‌ర్చించుకుంటు న్నారు. అదేస‌మ‌యంలో కొంద‌రు వైసీపీ నేత‌లు.. ఎల్లో మీడియాను న‌మ్మితే.. న‌ట్టేట మునిగిన‌ట్టే.. మ‌ళ్లీ ఇదేదో స్కెచ్ వేస్తోంది.. పార్టీకి-ఎంపీకి మ‌ధ్య మ‌రింత దూరం పెంచేలా చేస్తున్నారు.. అని గుస‌గుస  లాడుకుంటున్నారు. మొత్తంగా రాజుగారి ప‌రిణామం.. బోరు కొడుతున్నా ట్విస్ట్‌ల‌తో మాత్రం ప‌రుగులు పెడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: