రాష్ట్ర వ్యాప్తంగా  మీడియా వ‌ర్గాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంచ‌ల‌న వార్త ఇది! నిన్న మొన్న‌టి వ‌రకు త‌మ‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేసేవారిని, ప‌త్రిక‌ల్లో రాసేవారిని ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించిన ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌నే చెప్పాలి. కొన్ని కొన్ని సంద‌ర్భా ల్లో ప‌త్రిక‌ల్లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు, వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చినా.. జ‌గ‌న్‌.. దూకుడు పెంచ ‌లేదు. అధికారుల‌తో చిన్న‌పాటి హెచ్చరిక‌లు జారీ చేసి వ‌దిలి పెట్టారు. నిజానికి జ‌గ‌న్ అధికారంలోకి రావ ‌డాన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు, ప్ర‌త్య‌ర్థి పార్టీల కంటే ఎక్కువ‌గా చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉన్న మీడియా అస్సలు స‌హించ‌లేక పోయింది. 


గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు.. ఎన్నెన్ని క‌థ‌నాలో ఈ ఎల్లో మీడియాలో వ‌చ్చాయి. ఇంట‌ర్వ్యూలు, క‌థ నాలు, వార్త‌లు, క‌విత‌లు.. చిత్ర క‌థ‌లు ఇలా.. అనేక రూపాల్లో ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌కు వ్య‌తిరేక‌త వ‌చ్చేలా స‌ద‌రు ఎల్లో మీడియా ఎంతో క‌ష్ట‌ప‌డింది. మొత్తంగా టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల‌పాటు.. అప్ప‌టి సీఎం చం ద్ర‌బాబు నుంచి భారీగానే ముట్ట‌డంతో త‌గిన విధంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబుకు సాయం చేశారు. అ యితే, తాము ఒక‌టిత‌లిస్తే.. ప్ర‌జ‌లు మ‌రొక‌టి త‌ల‌వ‌డంతో చంద్ర‌బాబు ఓడిపోయారు. వాస్త‌వానికి చంద్ర ‌బాబును గెలిపించుకునేందుకు రోడ్డున ప‌డిపోతున్న వారితోనూ మాట్లాడించి.. బాబుపై ప్రశంస‌లు కురిపించేలా చేశారు. యాచ‌కుల‌తోనూ ఇంట‌ర్వ్యూలు ఇప్పించి పుణ్యం క‌ట్టుకుంది ఎల్లో మీడియా!


అయితే, ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో బాబు ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. అయితే, ఆయ‌న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజునే.. త‌న ప్ర‌భుత్వంపై త‌ప్పులు రాస్తే.. చ‌ర్య‌లు తీసుకుం టామ‌‌ని హెచ్చ‌రించారు. దీనిపై జ్యుడీషియ‌ల్ ఎక్వ‌యిరీ సైతం వేస్తామ‌న్నారు. జగ‌న్ చేసిన ఈ హెచ్చ‌రిక పై అప్ప‌ట్లో విప‌క్షాలు ఫైర‌య్యాయి. ప్ర‌భుత్వం అన్నాక విమ‌ర్శ‌లు రాకుండా ఎలా ఉంటాయి? అని ఎద ‌రు ప్ర‌శ్నించారు. నిజానికి ప్ర‌జాస్వామ్య దేశం కాబ‌ట్టి.. ప్ర‌భుత్వాలు వాటిపాల‌న‌ల‌పై స‌ద్విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఎప్పుడూ ఉంటుంది. కానీ, ప‌నిగ‌ట్టుకుని బుర‌ద‌జ‌ల్లితేనే అస‌లు స‌మ‌స్య‌. కాగా, ఈ ఏడాది జ‌గ‌న్ పాల‌న‌లో.. చంద్ర‌బాబును స‌మ‌ర్ధించే ప‌త్రికల శైలిలో కొన్ని భిన్న‌త్వం చోటు చేసుకుంది. 


కానీ, ఒకే ఒక్క ప‌త్రిక మాత్రం ఏడాదిన్న‌ర కాలంగా జ‌గ‌న్‌ను ఇంకా విమ‌ర్శిస్తూనే ఉంది. లాపాలు ఎత్తి చూ పుతున్నాం.. అనే.. పేరిట విషం కక్కేస్తున్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ప్ర‌భు త్వం అన్ని ప‌త్రిక‌లకు ప్ర‌భుత్వం తాలూకు యాడ్లు ఇచ్చినా.. ఈ ప‌త్రిక‌ను మాత్రం ప‌క్క‌న పెట్టింది. ఇప్పుడు ఏడాది ముగిసింది. ఈ నేప‌థ్యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ ప‌త్రిక య‌జ‌మాని.. `మేం ఎవ్వ‌రినీ దేబిరించం`` అని వ్యాఖ్యానించి.. ప్ర‌భుత్వం యాడ్లు ఇవ్వ‌క‌పోయినా.. నెట్టుకొస్తున్నాడు. గ‌తంలోను దివంగ‌త వైఎస్ ప్ర‌భుత్వంపై అవాకులు, చ‌వాకులు రాసిన ఈ పెద్ద‌మ‌నిషి.. ప్ర‌భుత్వం యాడ్లు ఇవ్వ‌క‌పోయే స‌రికి త‌ల‌బొప్పిక‌ట్టింది. 

 

దీంతో అప్ప‌ట్లోనే హైకోర్టుకు వెళ్లి కోర్టు తీర్పు ద్వారా యాడ్లు తెచ్చుకున్నారు. మ‌రి ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి?  ప్ర‌భుత్వం అన్ని ప‌త్రిక‌ల‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నా.. సీఎం జ‌గ‌న్‌ను తూర్పార‌బ‌ట్ట‌డంలో ముందు వెనుక కూడా చూడ‌కుండా సాగుతున్న ఈ ప‌త్రిక‌ను అధికారులు ప‌క్క‌న పెట్టారు. అయితే, ఇప్పుడు కూడా స‌ద‌రు ప‌త్రిక ఎండీ న్యాయ‌పోరాటానికి వెళ్తారా?   కోర్టుల‌కు వెళ్లి.. ప్ర‌భుత్వ యాడ్లు తెచ్చుకుంటారా? అనేది ఆస‌క్తిగా మారింది. గ‌తంలో ఆయ‌న దేబిరించం అన్న నోటితోనే ఇప్పుడు హైకోర్టులో పిటిష‌న్ వేస్తారా? అనేది చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో  మీడియాకు అందిన తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇప్ప‌టికే వేత‌నాలు త‌గ్గించ‌డం, సిబ్బందిని త‌గ్గించ‌డం వంటివి చేసినా.. ఇప్పుడు ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంద‌ని.. దేబిరించ‌డ‌మో.. న్యాయ‌పోరాటం చేయ‌డ‌మో.. ఏదో ఒక‌టి చేసుకుని ప‌త్రిక‌ను గ‌ట్టెంచుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం చెవిలో చిన్న‌మాట అంటూ. మీడియా మిత్రులు ఇదే విష‌యాన్ని చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: