ఔను! ఇప్పుడు ఈ విష‌యంపైనే రాజ‌కీయ‌ నేత‌లు స‌హా  రాజ‌కీయ విశ్లేష‌కుల‌ మ‌ధ్య చెవిలో చిన్న‌గా సాగుతు న్న గుస‌గుస ఇది!! ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాంను.. సీత‌తోను, ఎల్లో మీడియా లోని ఓ మీడియాను రామాయ‌ణ కాలంలో ల‌క్ష్మ‌ణుడు గీసిన గీత‌తోను పోలుస్తూ.. చర్చించుకుంటున్నారు. చాలా చిత్రంగా ఉన్న‌ప్పటికీ.. ఈ చ‌ర్చ‌ల్లో అయితే, కొంత ప‌స ఉంది!  సీతారాం రాజ్యాంగం అనే ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాటేస్తున్నార‌ని, ఈయ‌న క‌నుక... స్పీక‌ర్ అనే సీటులో లేకపోతే క‌నుక‌... కేసు పెట్టేయొ చ్చంటూ.. ఓ మీడియాలో వ‌చ్చిన‌ `వింత ప‌లుకు`లు నొక్కివ‌క్కాణించాయి. దీంతో నిజ‌మేనా? అంత ప‌నీ చేయొచ్చా?  నిజంగానే త‌మ్మినేని గీత‌లు దాటేశారా?  రేఖ‌లు చెరిపేశారా? అంటూ..  చెవులు కొరికేసుకుంటున్నారు నేత‌లు, విశ్లేష‌కులు. 

 

స్పీక‌ర్‌గా త‌మ్మినేని ఎంపికే ఓ సంచ‌ల‌నం! టీడీపీలో ఉండ‌గా చ‌క్రం తిప్పిన ఆయ‌న బీసీ వ‌ర్గానికి చెందిన వాడుగానే కాకుండా జ‌గ‌న్ వ్యూహాత్మంగా ప్ర‌తిప‌క్ష అధినేత చంద్ర‌బాబుకు చెక్ పెట్టేదిశ‌గానే ఎంపిక చేశా రు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం లేదు. వివాద ర‌హితుడు, అవినీతికి ఆమ‌డ‌దూరంలో ఉం డే త‌మ్మినేని.. ముక్కుసూటిగా మాట్లాడ‌తార‌నేది కూడా వాస్త‌వం. అంతేకాదు, ప‌ట్టుకుని వేలాడే ర‌క‌మూ కాదు. ఇక‌, రాజ‌కీయంగా మంచి దూకుడు చూపించే నాయ‌కుడిగా కూడా ఆయ‌న గుర్తింపు పొందారు. ఏ విష‌యాన్న‌యినా.. త‌న‌దైన శైలిలో విశ్లేషించే త‌త్వం ఉన్న నాయ‌కుడు. ఏదైనా అన్యాయం అనిపిస్తే.. నోరు విప్ప‌కుండా ఉండ‌లేని వీక్‌నెస్ కూడా ఆయ‌న‌కు సొంతం. 


అయితే, స్పీక‌ర్ అయిన త‌ర్వాత రాజ‌కీయంగా దూకుడు ఉండ‌కూడ‌ద‌నేది.. రాజ‌కీయాల్లో కొన్నేళ్లుగా ఉ న్న నానుడి. దీనికి కార‌ణం..అసెంబ్లీలో అటు ప్ర‌తిప‌క్షాల‌ను, ఇటు అధికార ప‌క్షాన్ని కూడా మేనేజ్ చేయా ల్సిన ప‌రిస్థితి ఉంటుంది కాబ‌ట్టి.. క‌రెంట్ ఎఫైర్స్‌కు కొంత దూరంగా ఉంటే.. ఆయ‌న‌పై అపోహ‌లు ఉండ ‌వ‌నేది అమ‌ల్లో ఉన్న వాస్త‌వమే! పైగా రాజ్యాంగ బ‌ద్ధ హోదా కావ‌డంతో ప్ర‌చారం ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో సంయ‌మ‌నం పాటించాల‌నే సూత్రం ఉంది. కానీ, ఇలానే ఉండాల‌ని ఎక్క‌డా అయితే లేదు. ఇక‌, ఇప్పుడు త‌మ్మినేని విష‌యాన్ని తీసుకుంటే.. ఈయ‌న హైకోర్టును, న్యాయ‌మూర్తుల‌ను విమ‌ర్శిస్తున్నార‌ని వింత ప‌లుకులు ప‌లికారు ఎల్లో మీడియా అధిప‌తి వారు. 


అంతేకాదు, ఆయ‌న క‌నుక స్పీక‌ర్ అనే సీట్లో లేక‌పోతే.. ఈపాటికే న్యాయ‌స్థానానికి ఈడ్చేసేవార‌ని కూడా అక్క‌సును క‌క్కేశారు. అయితే, స్పీక‌ర్ త‌మ్మినేని ఎప్పుడు మీడియాతో మాట్లాడినా.. సంయ‌మ‌నంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం ఉన్నత‌మ్మినేనికి ఈ విష‌యాలు తెలియ‌వ‌ని అనుకునే సాహ‌సం ఎవ‌రికీ లేదు. ఆఖ‌రుకు వింత ప‌లుకులు ప‌లికిన ఆ ప‌త్రికాధినేత‌కు కూడా! ఎందుకంటే..ఈ య‌న క‌లం ప‌ట్టుకునే స‌రికి ఆయ‌న రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్నారు. అలాంటి స్పీక‌ర్ ఇప్పుడు టీడీపీని ప‌రోక్షంగా టార్గెట్ చేసుకునే స‌రికి.. ఈ ఎల్లో మీడియా అధిప‌తికి నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. అందుకే.. రేఖ‌లు దాటేస్తున్నారంటూ.. క‌న్నీరు మున్నీరై.. రెచ్చ‌గొట్టే కార్య‌క్ర‌మాల‌కు తెర‌దీస్తున్నారు. 

 

వాస్త‌వానికి గ‌తంలో ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌గా ఉన్న దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్ కూడా కొంత మేర‌కు సంయ మ‌నం పాటించినా.. అనేక సంద‌ర్భాల్లో రేఖ‌లు దాటేశారు.  త‌నది కానీ, న‌ర‌సారావుపేట‌ నియోజ‌క‌వ‌ర్గంలో ఏదైనా  ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ప్పుడు స్థానిక ఎమ్మెల్యేను సైతం ప‌క్క‌న పెట్టి ఆయ‌నే పాల్గొ నేవారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న కోట‌ప్ప‌కొండ తిర‌నా ల‌ను ఆయ‌నే ద‌గ్గ‌రుండి చూసుకునేవారు. ని జానికి ఇది కూడా స్పీక‌ర్ ప‌రిధిని మ‌నం చ‌ర్చించుకుంటే.. ప‌రిధులు దాటిన‌ట్టుగానే భావించాల్సి ఉం టుంది. అంతేకాదు, 2018లో జ‌రిగిన పార్టీ మ‌హానాడు కు కూడా కోడెల హాజ‌ర‌య్యారు. మ‌రి ఆయ‌న‌పై ఈ ఎల్లో మీడియా ఏనాడూ `రేఖ‌`ల గురించిన ప్ర‌శ్న‌లు సంధించ‌లేదు. 


కానీ, నేడు నిజంగానే ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని కోర్టుల్లో వేస్తున్న పిటిష‌న్ల‌పై సాధార‌ణ పౌరులే ఆవేద‌న చెందుతున్న ప‌రిస్థితి ఉన్నప్పుడు.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న త‌మ్మినేని వంటి వారు కేవ‌లం స్పీక‌ర్ ప‌ద‌వి కార‌ణంగా.. మౌనం ఉండాల్సిన అవ‌స‌రం ఏముంటుం ది? అప్ర‌జాస్వామికంగా.. ఆయ‌న అయితే,మాట్లాడ‌లేదు క‌దా?!  పేద విద్యార్థుల‌కు ఇంగ్లీష్ మీడియంలో చ‌దువు చెబుతాన‌న్న ప్ర‌భుత్వంపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కి.. స‌ద‌రు నిర్ణ‌యానికి బ్రేకులు ప‌డేలా చేస్తున్న ఈ మీడియా గ‌ద్ద‌లు కానీ, సుద్దులు చెప్పే నేత‌లు కానీ.. త‌మ పిల్ల‌ల‌ను కూడా తెలుగు మీడియంలో చ‌దివించి అప్పుడు రాజ్యాంగ ప‌రిర‌క్షణ‌కు న‌డుం బిగించ‌మ‌నండి  అని గ‌తంలో స్పీక‌ర్‌గా త‌మ్మినేని చేసిన వ్యాఖ్య‌ల‌పైనా ఈ ఎల్లో మీడియా గొంతు చించుకుంది. కానీ, ఇప్పుడు మ‌రింత‌గా ముడివేసి.. వివాదం చేసి.. రేఖ‌లు దాటేస్తున్నారంటూ.. సీతారాంను సీత‌ను చేసే ప్ర‌య‌త్నం ఏదో జ‌రుగుతోంద‌న్న‌ది వాస్త‌వం. దీనినే నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: