ప్ర‌పంచ ప్ర‌సిద్ధి పొందిన తిరుమ‌ల రాయుడి విశేషాలు చెప్ప‌న‌ల‌వి కాదంటారు.. అన్న‌మ‌య్య‌. ``ఎక్క‌డి మానుష జ‌న్మంబెత్తిన ఫ‌ల‌మేమున్న‌ది..``-అంటూ.. శ్రీవారిని కీర్తించేందుకు స‌మ‌యం చిక్క‌డం లేద‌ని నెత్తీనోరూ బాదుకున్నారాయ‌న‌. ``అదివో.. అల్ల‌దివో.. హ‌రివాస‌ము..`` అంటూ వేనోళ్ల కొనియాడారు. ``.. బ్ర హ్మాండే నాస్తికించ‌న‌..వేంక‌టేశ స‌మోదేవో.. న‌భూతో.. న‌భ‌విష్య‌తి!!`` అని కూడా బ్ర‌హ్మాండ పురాణం స్ప ష్టం చేసింది. ఇక‌, ప్ర‌పంచంలోని ఏ మ‌తాచారంలోనూ.. ఏ కులాచారానికి సంబంధించిన సంప్ర‌దాయం లోనూ జ‌ర‌గ‌ని విధంగా.. నిత్య క‌ళ్యాణం.. ప‌చ్చ‌తోర‌ణంగా భాసిల్లుతున్న‌ది.. క‌లియుగ వైకుంఠ‌మైన తిరు మల‌.


నిత్య‌మూ.. కొన్ని ల‌క్ష‌ల మంది శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు.. వంద‌ల కిలో మీట‌ర్ల దూరాన్ని సైతం దా టుకుని.. వ‌చ్చి.. అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని, తిన్నామా.. తిన‌లేదా.. అనేది కూడా చూడ‌కుం డా.. ఆనంద నిల‌య ద‌ర్శ‌నంతో త‌మ జీవితాల‌ను పునీతం చేసుకుంటున్నారు. అఖ‌లాండ‌కోటి బ్ర‌హ్మాం డ నాయ‌కుడైన‌.. అయ్య‌వారి ద‌ర్శ‌న‌మే ప‌ర‌మావ‌ధిగా.. అచంచ‌ల భ‌క్తి విశాస్వంతో  భ‌వ‌బంధ విమోచ‌కుడి ని  కొలిచే కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాలకు ఇటీవ‌ల కాలంలో.. పెను స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో ఆధ్యాత్మికంగా కంటే కూడా.. కొంద‌రు అత్యుత్సాహంతో చేస్తున్న అమానుష కృత్యాల కార‌ణంగా నిత్యం మీడియాలో న‌లుగుతున్న‌ది!


అన్య‌మ‌త ప్ర‌చారానికి తిరుమ‌ల ఆల‌వాల‌మైందని.. ఇక్క‌డ‌.. ఏదో ఒక రూపంలో ఇత‌ర మ‌తాల‌ను ప్ర‌మో ట్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే ప్ర‌చారం పెరిగిపోతోంది. అదేస‌మ‌యంలో కొంద‌రు ప‌నిగ‌ట్టుకు ని శ్రీవారే స్వ‌యంగా న‌డ‌యాడిన తిరుమ‌ల కొండ‌పై.. సిగ‌రెట్లు.. మ‌ద్యం.. వంటివి విక్ర‌యించార‌ని కొన్ని రోజుల కింద‌ట తీవ్ర ఆరోప‌ణ‌లు రావ‌డం, రుజువులు సాక్ష్యాల‌తో బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డం.. తెలిసిందే. ఇక‌, ప‌శ్చిమ దేశాల సంస్కృతి అయిన‌.. బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్ల‌ను ఒక అధికారి ఏకంగా తిరుమ‌ల‌లోనే కొంద‌రు ఉద్యోగుల స‌మ‌క్షంలో నిర్వ‌హించుకున్న ఘ‌ట‌న కూడా భ‌క్తుల‌కు మ‌నో వేద‌న క‌లిగించేదే. అయితే, ఎందుకు ఇలా జ‌రుగుతున్న‌ది? అనేది కీల‌క చ‌ర్చ‌నీయాంశం.


ఇక‌, తాజాగా తిర‌మ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వారు ప్ర‌తిష్టాత్మ‌కంగా నెల నెలా ప్ర‌చురించే `స‌ప్త‌గిరి` మాస‌ప త్రిక‌పై వివాదాలు ముసురుకున్నాయి. నెల రోజుల కింద‌ట ఓ బాలుడు రాసిన రామాయ‌ణం క‌థ‌పై తీవ్ర వివాదం నెల‌కొంది. స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక‌కు.. రాష్ట్రం, దేశం స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా  కొన్ని కోట్ల మంది చం దాదారులు ఉన్నారు. అనేక భార‌తీయ భాష‌ల్లో ఈ పుస్త‌కం వెలువ‌డుతుంది. శ్రీవారి విశేషాలతో కూడిన ఈ పుస్త‌కాన్ని ప్ర‌తి భ‌క్తుడు.. శ్రీవారి కానుక‌గా భ‌ద్రంగా దాచుకుంటాడు. అలాంటి పుస్త‌కంపైనా వివాదం వ చ్చింది. `సీతారాముల‌కు.. ల‌వుడు ఒక్క‌డే కుమారుడని, కుసుడు అనే ప్ర‌స్తావ‌న లేద‌ని` పేర్కొంటూ.. ఓ నెల రోజుల కింద‌ట ఓ బాలుడు రాసిన క‌థ‌ను ప్ర‌చురించారు. ఇది తీవ్ర వివాదానికి కార‌ణ‌మైంది. 


ఇక‌, తాజాగా  సప్తగిరి మాసపత్రికతో పాటు సువార్త పుస్తకం కూడా ఓకే పోస్టల్‌ కవర్‌లో భక్తునికి అందడం గుంటూరులో కలకలం సృష్టించింది. గుంటూరులోని మల్లికార్జునపేటకు చెందిన రత్నవిష్ణు అనే భక్తునికి శ్రీవారి విశేషాలతో కూడిన సప్తగిరి మాసపత్రిక నెలనెలా పోస్టులో అందుతుంది. జూలై నెలకు సంబంధిం చిన సప్తగిరి పత్రిక సోమవారం రత్నవిష్ణుకు అందింది. అయితే, అదే కవర్‌లో ‘సజీవ సువార్త’ అనే పేరు తో క్రైస్తవ ఉజ్జీవ మాసపత్రిక కూడా ఉండటంతో ఆయన నివ్వెరపోయారు. ఇక‌, ఈ విష‌యం తెలియ‌గానే య‌ధాలాపంగా.. టీటీడీ అధికారులు త‌మ‌కు సంబంధం లేద‌ని, ప‌రిశీలిస్తామ‌ని చెప్పుకొచ్చారు.  వాస్త‌వాని కి  ప్ర‌ముఖ ఆరాధ‌నా ప్రాంతాలైన జెరూస‌లేంలోకానీ, మ‌క్కాలో కానీ.. లేని విధంగా ఒక్క తిరుమ‌ల, దాని వ్య‌వ‌హారాల్లోనే ఎందుకు ఇలా జ‌రుగుతోంద‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే.. దీనికి స‌మాధానం లేదు.. మున్ముందు ఉంటుందో లేదో కూడా తెలియ‌దు!! అంతా.. శ్రీవేంక‌టేశ్వ‌రార్ప‌ణం అనుకోవాల్సిందే!!

మరింత సమాచారం తెలుసుకోండి: