భార‌త దేశాన్ని ఓ మ‌లుపు తిప్పిన పార్టీగా.. స్వాతంత్రోద్య‌మ చ‌రిత్ర‌ను సైతం నిక్షిప్తం చేసుకున్న పార్టీగా చ రిత్ర‌కెక్కిన పార్టీ కాంగ్రెస్‌. ద‌శాబ్దాల పాటు ఈ దేశాన్ని.. రాష్ట్రాల‌ను సైతం పాలించిన పార్టీగా కాంగ్రెస్ గుర్తిం పు సాధించింది.  అయితే, ఇప్పుడు ఆ పార్టీ ప‌రిస్థితి మాత్రం ``మా తాత‌లు నేతులు తాగారు.. మా మూతులు వాస‌న చూడండి!`` అన్న‌ట్టుగానే ఉంది. మ‌రో మూడున్న‌ర ఏళ్ల‌లోనే దేశంలో సార్వ‌త్రిక స‌మ రం రానుంది. అయితే, ఇప్ప‌టికే రెండు సార్లు పిల్లిమొగ్గ‌లు వేసిన‌.. కాంగ్రెస్ ప‌రిస్థితి అప్ప‌టికి పుంజుకుం టుందా?  కోదా? అనేది ఒక విష‌యం అయితే.. దీనిక‌న్నాముందు.. కాంగ్రెస్ కుటుంబంలో గాంధీల వార సుడిగా.. రంగంలోకి వ‌చ్చిన రాహుల్ నాయ‌క‌త్వ ప‌టిమ ఏ మేర‌కు నిల‌బ‌డుతుంది? అనేది కీల‌క ప‌రిణా మంగా మారింది. 


ఎవ‌రు ఔన‌నా క‌ద‌న్నా.. కాంగ్రెస్‌లో రాహుల్ నాయ‌క‌త్వానికి మార్కులు ప‌డ‌లేదు. ఆయ‌న కాంగ్రెస్ అధ్య క్షుడిగా(స్వ‌తంత్ర రాజీనామా స‌మ‌ర్పించారు) ఆయ‌న రాణించ‌లేక పోయార‌నేది వాస్తవం. చ‌రిత్ర‌లో నిలి చిపోయే వ్యూహాల‌కు.. ఒక‌నాడు.. రాహుల్ నాయ‌న‌మ్మ ఇందిరాగాంధీ అడుగులు వేస్తే.. రాజీవ్ గాంధీ ఆ బాట‌ల‌ను మ‌రింత ప‌దిలం చేస్తే.. ఇప్పుడు రాహుల్ క‌నీసం ఆ దారుల్లో న‌డిచే ప్ర‌య‌త్నం కూడా చేయ క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా రాహుల్ చేయాల్సిన ప్ర‌ధ‌మ ప‌ని.. మీడియాను త‌న‌వైపు తిప్పుకోవ‌డం!  ఇది పూర్త‌యితేనే త‌ప్ప‌.. రాహుల్ రాజ‌కీయంగా దూకుడు చూపించినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు మాత్రం వెళ్లలే రనేది వాస్త‌వం. కేంద్రంలో అధికారంలోకి రావ‌డానికి మీడియా స‌హ‌కారం ఎంతో అవ‌స‌ర‌మ‌నేది వాస్త‌వం. 


రెండు ప‌ర్యాయాలు న‌రేంద్ర మోడీ అధికారంలోకి రావ‌డం వెనుక బ‌ల‌మైన మీడియా లాబీయింగ్ ఉంద నేది నిర్వివాదాంశం. కానీ, ఈ విష‌యంలో రాహుల్ విఫ‌ల‌మ‌వ‌డంతోపాటు.. మీడియా దృష్టిలో జోక‌ర్ అ య్యారు. అదేస‌మ‌యంలో రాష్ట్రాల ఎన్నిక‌ల్లోనూ అలివిమీరిన పొత్తుల‌కు తెర‌లెత్త‌డం.. కూడా రాహుల్‌కు క‌లిసి రాని ప‌రిణామంగానే చెప్పాలి. యూపీలోను, తెలంగాణ‌లోనూ.. చేసిన ప్ర‌యోగాలు పూర్తిగా చ‌తికిల ప‌డేలా చేశాయి. ఇక‌, బ‌ల‌మైన మోడీ గ‌ళాన్ని నిలువ‌రించ‌డంలోనూ రాహుల్ చేతులు ఎత్తేశారు. స‌మ‌యా నికి త‌గిన విధంగా కేంద్ర ప్ర‌బుత్వాన్ని కౌంట‌ర్ చేయ‌డంలోనూ ఆయ‌న సాహ‌సం చేయ‌లేక పోయారు. రా మ‌జ‌న్మ‌భూమి-అయోధ్య‌, జ‌మ్ము-క‌శ్మీర్‌, త‌లాక్  బిల్లు.. పాక్‌తో యుద్ధం వంటి అనేక విష‌యాలు.. స‌హా మ ‌రో ముఖ్య‌మైన పౌర‌స‌త్వ బిల్లులు మోడీ తీసుకువ‌చ్చిన‌ప్పుడు.. త‌న వాయిస్‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి, ప్ర‌జ‌ల వాయిస్‌ను బ‌లంగా పార్టీ త‌ర‌ఫున వినిపించ‌లేక పోయారు. 


ఇవ‌న్నీ.. ఇప్పుడు ఎందుకు చ‌ర్చ‌నీయాంశాలు అయ్యాయంటే.. చైనా విష‌యంలో మ‌రోసారి మోడీ త‌న ‌ను తాను చాటింపు వేసుకుని, వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని మీడియా ద్వారా.. మ‌రోసారి గ్రేట్ అని అనిపించుకున్నారు. ఇది మ‌రికొద్ది నెలల్లో దేశంలో జ‌ర‌గ‌బోయే .. బిహార్‌, ప‌శ్చిమ‌బెంగాల్ వంటి కీల‌క రాష్ట్రాల ఎన్నిక‌లకు మోడీకి చోద‌క శ‌క్తిగా వినియోగ‌ప‌డుతుంది. కానీ, ఇదే స‌మ‌యంలో చైనా విష యంలో మోడీ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేసినా.. రాహుల్ వ్యాఖ్య‌లు కానీ, విమ‌ర్శ‌లు కానీ.. పెద్ద‌గా ప్రాధాన్యానికి నోచుకోలేక పోయాయి. దీంతో కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి? మ‌రో మూడున్న‌రేళ్ల‌లో దేశంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను, త్వ‌ర‌లోనే వ‌చ్చే రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను ఈ పార్టీ త‌ట్టుకుని నిల‌బ‌డుతుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నేత‌ల చెవిలో చిన్న‌మాట‌గా వినిపిస్తున్న‌ది!!

మరింత సమాచారం తెలుసుకోండి: