దివంగత సీఎం రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న జీవితంలో చోటు చేసుకున్న.. పెద్ద‌గా ప్ర‌జ ల‌కు తెలియ‌ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక‌టి.. ఆయ‌న పంచుక‌ట్టు! సాధార‌ణంగా.. రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల్లో అతి త‌క్కువ మంది మాత్ర‌మే పంచెక‌ట్టుతో మ‌న‌కు క‌నిపి స్తారు. అంతేకాదు, సుమారు వ‌య‌సు కూడా దీనిపై ప్ర‌భావం చూపిస్తుంది. మ‌ధ్య వ‌య‌సు దాటిన వారు మాత్ర‌మే పంచ‌క‌ట్టుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ, వైఎస్ విష‌యంలో మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం. ఆయ‌న ఎక్కువ‌గా పంచెకట్టుకే ప్రాధాన్యం ఇచ్చేవారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా ఆయ‌న దేశంలో ఎక్క‌డికి వెళ్లినా .. పంచెకట్టుతోనే ఉండేవారు. 


ఆర‌డుగుల ఆహార్యంతో స్ఫుర‌‌ద్రూపిగా ఉండే వైఎస్‌.. థ‌ళ‌థ‌ళ మెరిసే... థ‌ళ‌థ‌ళ మెరిసే.. పంచెక‌ట్టుతో చూడ‌గానే ఆక‌ట్టుకు నేవారు. ఈ పంచెల‌ను ఆయ‌న ప్ర‌త్యేకంగా ధ‌ర్మ‌వ‌రం నుంచి నేయించి కాంగ్రెస్ నాయ‌కులు పంపించేవా ర‌ని అప్ప‌ట్లో చెప్పుకొనేవారు. తాను అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షం నాయ‌కుడిగా ఉన్నా.. పార్టీ త‌ర‌ఫున ఏ కార్య‌క్ర ‌మం నిర్వ‌హించాల్సి వ‌చ్చినా.. కూడా వైఎస్ పంచెక‌ట్టుకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఓ సంద‌ర్భంలో కాంగ్రెస్ నేత‌ల‌ను తీసుకుని ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానాన్ని క‌లుసుకునేందుకు వెళ్లారు వైఎస్‌. అప్పుడు అంద రూ ఫ్యాంటూ షర్టులు ధ‌రించారు. ఈ బ్యాచ్‌లోని జానారెడ్డి మాత్రం వైఎస్ మాదిరిగా.. పంచెక‌ట్టుతో క‌నిపిం చారు. ఈ విష‌యం ఢిల్లీలో ఆస‌క్తిగా మారింది. 


అప్ప‌టి కాంగ్రెస్ అధ్య‌క్షురాలు.. సోనియా గాంధీ.. వైఎస్ పంచెకట్టుని ఆస‌క్తిగా గ‌మ‌నించారు. అప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడు నేత‌లు క‌ట్టుకునే `అడ్డ క‌ట్టు`నే చూసిన ఆమెకు వైఎస్ క‌ట్టుకున్న పంచెక‌ట్టు ఆస‌క్తిని రేపింది. ఇది తెలుగు వారి సంప్ర‌దాయ‌మ‌ని,  పండుగ‌లు.. ముఖ్య‌మైన సంద‌ర్భాల్లో అంద‌రూ ఇప్ప‌టికీ పంచెక‌ట్టుకుంటార‌ని వైఎస్ వివ‌రించార‌ట‌. దీనిపై ముచ్చ‌ట‌ప‌డిన సోనియా.. అనంత‌రం ఓ సంద‌ర్భం లో.. రాహుల్‌కు కూడా పంచెక‌ట్టు నేర్పించ‌మ‌ని.. వైఎస్ కోరార‌ట‌. దీంతో వైఎస్ స్వ‌యంగా ధ‌ర్మ‌వ‌రం నుంచి నేయించిన పంచెల‌ను తీసుకుని ఢిల్లీ వెళ్లారు. 


ఆయ‌నే స్వ‌యంగా రాహుల్‌కు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా పంచెక‌ట్టి.. సోనియా ముచ్చ‌ట తీర్చార‌ని కాంగ్రెస్ నేత‌లు క‌థ‌క‌థ‌లుగా చెప్పుకొనేవారు. త‌ర్వాత కాలంలో రాహుల్ ద‌క్ష‌ణాది రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన స‌మ‌యంలోనూ, తిరుమ‌ల వంటి పుణ్య క్షేత్రాల‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా పంచెక‌ట్టుకునేవారు. ఇలా వైఎస్‌కు పంచెక‌ట్టుకు చాలా అనుబంధం ఉంది. అయితే, వైఎస్ దేశీయంగా పంచెక‌ట్టులో క‌నిపించినా.. విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు మాత్రం సూటు వేసుకునే వారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: