``వ్య‌వ‌స్థ‌పై రాజ‌కీయాలు చేయండి. వ్య‌వ‌స్థ‌ను స‌న్మార్గంలో న‌డిపించేందుకు రాజ‌కీయాలు చేయండి. వ్య ‌క్తుల్ని రాజ‌కీయం చేయ‌కండి. ఇలా చేయ‌డం తాత్కాలిక ప్ర‌యోజ‌నమే అవుతుంది``- రాజ్యాంగ నిర్మాత, బీ ఆర్‌ అంబేడ్క‌ర్ అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంలోని నేత‌ల‌కు, రాజ‌కీయ పార్టీల‌కు దాదాపు 90 ఏళ్ల కింద ‌టే ఇ చ్చిన పిలుపు. అయితే, నిత్యం అంబేడ్క‌ర్ స్మ‌ర‌ణ‌లో మునిగి.. ఆయ‌న భ‌జ‌న చేసే.. రాజ‌కీయ నేత లు, కుల సంఘాల నాయ‌కులు.. చేస్తున్న‌ది ఏమిటి? అంబేడ్క‌ర్ మాకు ఆరాధ‌నీయుడు.. మాకు మార్గ‌ద ‌ర్శి.. అంటూనే ఏమార్గం ప‌డుతున్నారు? ఎటు న‌డుస్తున్నారు?. 

 

నిజానికి నేడు అంబేడ్క‌ర్ గురించి మాట్లా డేవారు.. ఆయ ‌న విగ్ర‌హాల‌తో రాజ‌కీయాలు చేసేవారు.. కుల సంఘాలు.. అదే అంబేడ్క‌ర్ నుంచి నేర్చు కున్న‌ది ఏమిటి?  ``ప‌రోప‌దేశ వేళాయం.. స‌ర్వం వ్యాస, ప‌రాశ‌ర‌``-అన్న‌ట్టుగా అంబేడ్క‌ర్ గురించి మాట్లాడాల్సి వ‌స్తే.. ఎదు టి వారికి నీతులు చెబుతారు. కానీ, త‌మ దాకా వ‌స్తే.. మాత్రం అంబేడ్క‌ర్ ఏం చెప్పారో.. ఆయ‌న ఏమార్గా న్ని ఆ చరించ‌మ‌న్నారో..కూడా గుర్తుకు రాదు!  ``నాకు ఏ విగ్ర‌హాలూ వ‌ద్దు.. న‌న్ను రాజ‌కీయమూ చేయొ ద్దు.. నేను రాసిన పుస్త‌కాలు చ‌దవండి.. రాజ్యాంగాన్ని గౌర‌వించండి. వాటిలో మీకు న‌చ్చింది ఏదైనా ఉం టే.. ఆచ‌ర‌ణ‌లో పెట్టండి.. ఈ దేశాన్ని స‌న్మార్గంలో న‌డిపించండి``- ఇదీ.. అంబేడ్క‌ర్ నోటి నుంచి ఈ జాతికి అందిన‌ ఆఖ‌రి మాట‌!

 

మ‌రి మ‌నం ఏం చేస్తున్నాం? ఆయ‌న‌ను ఎలా చూస్తున్నాం? ఆయ‌న‌ను కేవ‌లం ఓ విగ్ర‌హానికి ప‌రిమితం చేస్తున్నామా? ఆయ‌న‌ను రాజ‌కీయం చేసేస్తున్నామా?  మావాడంటే.. మావాడ‌ని.. మాకు మాత్ర‌మే చెందిన వాడ‌ని.. జెండాలు క‌ప్పేస్తున్నామా? అంటే.. ఔను.. ఇప్పుడు ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయాల‌ను ప‌రిశీలి స్తే.. ఇలాంటి ప‌రిస్థితి క‌ళ్ల‌కు క‌డు తుంది. అధికార పార్టీలో ఉన్న వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీ పీల రాజ‌కీయ కొలిమిలో అంబేడ్క‌ర్ న‌లిగిపోతున్నాడ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు! నిగ్ర‌హం కోల్పోతున్న విగ్ర‌హ రాజ‌కీయాలు రాష్ట్రంలో పెచ్చ‌రిల్లాయి. అమ‌రావ‌తిలో అంబేడ్క‌ర్ స్మృతి వ‌నం ఏర్పాటు చేస్తామంటూ.. గ‌తంలో అధికారంలో ఉన్న‌చంద్ర‌బాబు రాజ‌ధాని ప్రాంతంలోని ఐన‌వోలులో శంకుస్థాప‌న చేశారు. 


అయితే, ప‌నులు మాత్రం ముందుకు సాగ‌లేదు. అంబేడ్క‌ర్‌ను అడ్డు పెట్టుకుని.. ద‌ళితుల ఓటు బ్యాంకు ను త‌న ఖాతాలో వేసుకునేందుకు బాబు ప్ర‌య‌త్నించార‌ని అప్ప‌ట్లో వైసీపీ ఆరోపించింది. ఇక‌, ఇప్పుడు వైసీపీ వంతు వ‌చ్చింది. ఏకంగా విజ‌య‌వాడ న‌డిబొడ్డున అంబేడ్క‌ర్ విగ్ర‌హం, స్మృతి వ‌నం నిర్మించేందు కు సీఎం జ‌గ‌న్‌.. శంకు స్థాప‌న కూడా చేసేశారు. ఈ మొత్తం ప‌రిణామం.. అధికార ప్ర‌తిప‌క్షాల మధ్య రాజ ‌కీయ దుమారం రేపింది. అమ‌రావ‌తిలోని స్మృతి వ‌నాన్ని త‌ర‌లించ‌రాదని టీడీపీ డిమాండ్లు లేవనెత్తింది. అలా చేస్తే.. అంబేడ్క‌ర్‌ను అవ‌మానించిన‌ట్టేన‌ని చెప్పుకొచ్చింది. 

 

అయితే ఈ విష‌యంపై వైసీపీ నుంచి కౌంట‌ర్లు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. స‌మున్న‌త వ్య‌క్తిత్వం, దీర్ఘ దృష్టి.. విశాల జ‌నహితం ఉన్న అంబేడ్క‌ర్‌ను విగ్ర‌హానికి మాత్ర‌మే ప‌రిమితం చేయ‌డం ఏమేర‌కు సమంజ‌స‌మో పాల‌కులు, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, సంఘాల నేత‌లు కూడా గ‌మ‌నించారు. అంబేడ్క‌ర్ చెప్పిన వాటిలో క‌నీసం ఒక‌టి రెండు అంశాల‌నైనా జీవితంగా ఆచ‌ర‌ణ‌కు తీసుకుంటే.. ఆయ‌న‌కు అదే నిజ‌మైన నివాళి అవుతుంద‌న‌డంలో సందేహం లేదు!!

మరింత సమాచారం తెలుసుకోండి: