ఔను! ఇప్పుడు ఈ మాట వైసీపీలో చెవిలో చిన్న‌గా వినిపిస్తోంది. ఒక‌వైపు పార్టీ దూకుడుగా ఉంది. సీఎం జ ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యాల‌ను వేగంగా తీసుకుంటున్నారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలో వైసీపీ మూడు కాలాల పాటు వే ళ్లూనుకునేలా అన్ని సామాజిక వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోతున్నారు. ఆయ‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌జల ‌కు ఇచ్చిన అన్నిహామీల‌ను నెర‌వేర్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దేశంలోనే భిన్నంగా రాష్ట్రాన్ని ముందుకు న‌డిపిస్తున్నారు. జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు, అమలు చ‌స్తున్న ప‌థ‌కాల‌పై రాష్ట్రంలోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల వారు కూడా వాటిని అనుస‌రిస్తున్నారు. 


ఇలా సాగుతున్న జ‌గ‌న్ ప్ర‌భ‌ను అడ్డుకునేందుకు, నేల‌మ‌ట్టం చేసేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప్ర య‌త్నిస్తూనే ఉంది. ప్ర‌తి విష‌యంలోనూ, ప్ర‌తి నిర్ణ‌యంలోనూ, ప్ర‌తి పథ‌కంలోనూ రంధ్రాన్వేష‌ణ చేస్తు న్నారు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు. అయితే, వీరిపై ఎదురు దాడి చేయ‌డ‌మో.. స‌మాధానం చెప్ప‌డ‌మో.. చేయొ చ్చు. దీనిపై ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశమూ ఉంటుంది. ప్ర‌తిప‌క్షాలు.. అధికార ప‌క్షాన్ని టార్గెట్ చేస్తున్న తీరు కు కౌంట‌ర్లు కూడా ఇవ్వొచ్చు. అయితే, ఎటొచ్చీ.. ఇది ఇలా సాగుతుంటే.. మ‌రోప‌క్క‌.. సొంత పార్టీ నేత‌లే ఏకుల్లా ఉంటూ.. మేకుల్లా గుచ్చుకుంటున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను విమ‌ర్శించ‌డం, ప్ర‌భుత్వం తీసు కుంటున్న నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించ‌డం వైసీపీ నేత‌ల‌కు కామ‌న్‌గా మారిపోయింది. 


నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ వ్య‌వ‌హారం పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. చివ‌రికి షోకాజ్ ఇ చ్చేవ‌ర‌కు వెళ్లి కూడా మ‌రింత పీట‌ముడి ప‌డింది. ఆయ‌న హైకోర్టుకు ఎక్క‌డం, పార్టీ పార్ల‌మెంటు స్పీక ‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డం.. బ‌హుశ ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ రాజ‌కీయాల్లోనే ఇలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకుని ఉండ‌ద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌, ఇప్పుడు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కూడా ఒక ర‌కంగా నిర‌స‌న గ‌ళం వినిపించారనే అంటున్నారు ప‌రిశీల కులు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నిర్ణ‌యం.. మేనిఫెస్టోలో కూడా పొందుప‌రిచిన నిర్ణ‌యం జిల్లాల విభ‌జ‌న‌. 

 

రాష్ట్రంలోని ప్ర‌తిపార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్నీ ఒక జిల్లా చేస్తాన‌ని ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందుగానే చె ప్పారు. ఈ ప్ర‌క్రియ వ‌చ్చే ఏడాది మ‌ధ్య నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఇప్పుడు ఈ విష‌యంపై ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. కొత్త వివాదం తెర‌మీదికి తెచ్చారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాం లో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టార‌ని, జిల్లాలో అభివృద్ధి చెందిన ఎచ్చెర్ల, పాలకొండ, రాజాం ప్రాంతాలు.. కొత్త జిల్లాల విభజనలో భాగంగా విజయనగరం(పార్ల‌మెంటు స్థానం) జిల్లాలో కలసిపోతాయన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందని ధ‌ర్మాన చెప్పుకొచ్చారు. అదే జరిగితే జిల్లా అభివృద్ధి 80 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారని అన్నారు.  

 

ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. ప్రజలు, నేత ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని అంటూనే.. పార్లమెంటు నియో జకవర్గాల ప్రాతిపదికన చేయొద్దని కోరారు. దీనిపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం దొరుకుతుందని కూడా ప‌రోక్షంగా ధ‌ర్మాన చుర‌క‌లంటించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న విశ్లేష‌కులు ఆశ్చ‌ర్య పోతున్నారు. ఆనాడు మేనిఫెస్టోలో ఈ అంశం పెట్టిన‌ప్పుడు వీరు ఏం చేశారు? అప్పుడు గుర్తుకు రాని విష‌యాలు.. ఇప్పుడు ఎందుకు తెర‌మీదికి వ‌స్తున్నాయి. 

 

ఏదైనా ఉంటే.. మంచి, చెడుల‌ను అప్ప‌ట్లోనే చ‌ర్చించి మార్పులు చేయిస్తే.. స‌రిపోయేది క‌దా.. కానీ, ఇప్పుడు నిర్ణ‌యం తీసుకునేందుకు అన్నీ రెడీ అవుతున్న స‌మ‌యంలో ఇలా పుల్ల‌లు పెట్ట‌డం అంటే.. ఇలాంటి వారు స‌భ్య‌స‌మాజానికి ఎలాంటి మేసేజ్ ఇస్తున్నారు? అనే ప్ర‌శ్నిస్తున్నారు. అందునా ధ‌ర్మాన వంటి సీనియ‌ర్లు, దూర‌దృష్టి ఉన్న నాయ‌కులు ఆదిలోనే జ‌గ‌న్‌కు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చి ఉంటే.. బాగుండేది త‌ప్ప‌.. ఇప్పుడు రోడ్డున ప‌డి.. విమ‌ర్శ‌లు సంధించ‌డం, చుర‌క‌లు అంటించ‌డం ఏమేర‌కు స‌మంజ‌స‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: