ఏపీ రాజ‌కీయ ప‌రిస్థితులు మెట్ట‌వేదాంతాన్ని త‌ల‌పిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ``ఎన్నో అ నుకుంటాం.. అన్నీ జ‌రుగుతాయా?  సోద‌రా?`` అని నేత‌లు చ‌ర్చించుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. ఈ త‌ర‌హా చ‌ర్చ అది.. ఇది .. అనే తేడా లేకుండా అన్ని ప్ర‌ధాన పార్టీల్లోనూ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అధి కార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌లు స‌హా క‌మ్యూనిస్టుల్లోనూ ఈ త‌ర‌హా చ‌ర్చ సా గుతుండ‌డంతో అస‌లు ఏపీలో రాజ‌కీయాలు ఏ దిశ‌గా న‌డుస్తున్నాయ‌నే చ‌ర్చ‌.. విశ్లేష‌కుల మ‌ధ్య సాగు తోంది. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. వైసీపీ నేత‌లు.. వ‌చ్చిన తొలి ఏడాదిలోనే అనేక సంచ‌ల‌నాలు చేశారు.  అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టారు. 


ఈ క్ర‌మంలోనే రాజ‌ధానిని మార్పు చేయాల‌ని సంక‌ల్పించారు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పేరుతో మూడు రాజ‌ధానుల‌కు జైకొట్టారు. దీంతో ఇక, త‌మ‌కు తిరుగులేద‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కోర్టు జో క్యంతో ఎప్పుడు జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అదేస‌మ‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ వ్య‌వ‌హారంలోనూ ఆయ‌న‌ను మార్చి తీరాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. అయితే, దీని కి కూడా కోర్టుల నుంచి వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. ఇక‌, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రంగుల విష‌యంలో నూ ఒకింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో అధికార పార్టీ నేత‌లు..  ఎన్నో అనుకుంటాం కానీ.. జ‌రుగుతాయా..  సోద‌రా?  అని చ‌ర్చించుకుంటున్నారు. 


ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌ద్దాం.. సొంత పార్టీలోనే నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. ఎక్క‌డా చంద్ర‌బాబుకు క‌లిసి వ‌చ్చే నాయ‌కాగ‌ణం కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో ఏకంగా.. చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు లోకేష్ బాబులు.. ఎన్నో అనుకుంటాం.. అన్నీ జ‌రుగుతాయా? అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇక‌, పార్టీలో యు వ నేత‌లు కూడా త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్కుతుంద‌ని ఎదురు చూసీచూసీ.. ఇదే మాట‌ల‌తో స‌రిపెట్టుకుం టున్నారు. ఇక‌, సీనియ‌ర్ల ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ``ప్ర‌భుత్వాన్ని నిలువ‌రించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఒక్క‌టి కూడా ఫ‌లించ‌డం లేదు. మ‌నోళ్ల‌ను కాపాడుకునేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తు న్నాం.. అయినా.. ఏదో ఒక కేసులో ఇరుక్కుంటున్నారే.. వీరి కోసం ఏం చేయాలి?`` అని చ‌ర్చించుకుం టున్నారు. 

 

బీజేపీ విష‌యానికి వ‌స్తే.. పార్టీని ప‌రుగులు పెట్టించాల‌ని గ‌డిచిన ఏడాదిన్న‌ర‌గా వేయ‌ని ప్లాన్ లేదు. ఇం టింటికీ.. కాషాయ జెండా నినాదాన్ని కూడా అందుకున్నారు. అయినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. ఇక‌, పార్టీని బ‌లోపేతం చేయాల‌న్ని ప్ర‌య‌త్న‌మూ ముందుకు సాగ‌డం లేదు. అంద‌రూ క‌లిసి ఏక‌తాటిపై నిల‌బ‌డాల ‌న్న వ్యూహ‌మూ అట‌కెక్కింది.  దీంతో క‌మ‌ల‌నాథులు కూడా ``ఎన్నో అనుకుంటాం.. కానీ, జ‌రుగుతాయా సోద‌రా?`` అని నిట్టూర్పులు విడుస్తున్నారు. క‌మ్యూనిస్టుల ప‌రిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీలేదు. వా రు కూడా అనేక ఉద్య‌మాలు చేయించాల‌ని భావించారు.. ప్ర‌జ‌ల నుంచి ఓటు బ్యాంకును సొంతం చేసుకో వాల‌ని భావించారు. అయినా.. సాధించ‌లేక పోతున్నారు. దీంతో వీరు కూడా ఈ డైలాగుతోనే స‌రిపెట్టుకుం టున్నారు. 


ఇక‌, జ‌న‌సేన ప‌రిస్థితి కూడా ఇంతే! ప్ర‌శ్నిస్తానంటూ..పార్టీ పెట్టిన ప‌వ‌న్ వెప‌న్ మాత్రం కాలేక పోయారు. ఏ ప్ర‌భుత్వాన్నీ ఆయ‌న ప్ర‌శ్నించ‌లేక పోతున్నారు. ఆయ‌న అధికార ప‌క్షం పాత్ర పోషిస్తున్నారా? ప‌్ర‌తిప‌క్షం పాత్ర పోషిస్తున్నారా? అనేది డౌటే. ఈ నేప‌థ్యంలోనే ఆపార్టీలో ఉన్న కొద్దిపాటి నాయ‌కులు .. ఎన్నో అనుకుంటాం.. కానీ, అవుతాయా? అని నాలిక చ‌ప్ప‌రిస్తున్నారు. ``మ‌రి ఈ ప‌రిస్థితిలో ఉన్న నాయ‌కులు మాకేం చేస్తారు? ఎన్నో అనుకుని వీళ్లకి ఓట్లేశాం(ఓడిపోయిన వారికి కూడా) కానీ, అన్నీ జ‌రుగుతాయా?!`` అని ప్ర‌జ‌లు కూడా నిట్టూరుస్తున్నారు!! ఇదీ సంగ‌తి!!!

మరింత సమాచారం తెలుసుకోండి: