రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చారు అంటే.. ప్ర‌జా సేవ కోసం అనే మాట దాదాపుగా ఏనాడో పోయింది. ఇప్పు డు ఎవ‌రిని ప‌ల‌క‌రించినా.. ఏ పార్టీని ప‌ట్టి చూసినా అధికారం కోస‌మే అనేమాట స్ప‌ష్టంగా వినిపిస్తోంది. అయితే, ప్ర‌జాస్వామ్య దేశాల్లో ప్ర‌జ‌లు త‌మ ఓటు హ‌క్కు ద్వారా ప్ర‌భుత్వాల‌ను ఎన్నుకోవ‌డం తెలిసిందే. అయితే, దీనికి విరుద్ధంగా ఇప్పుడు దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా క్ర‌తువులు ముందుకు సాగుతున్నాయి. మెజారిటీ లేకున్నా.. ఏదో ఒక రూపంలో దొడ్డిదారిలో అయినా స‌రే.. తాము అనుకున్న అధికారంలోకి వ‌చ్చి తీరాల‌నే విధానం దేశాన్ని ఏలుతున్న బీజేపీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. 


ఏడాది  కింద‌ట క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి ప్ర‌భుత్వాన్ని కూల్చే వ‌ర‌కు నిద్ర‌పోని.. బీజేపీ నాయ కులు న‌యానో.. భ‌యానో.. అక్క‌డి కూట‌మి ప‌క్షాల్లోని ఎమ్మెల్యేల‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి.. య‌డియూ ర‌ప్ప ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేలా చ‌క్రం తిప్పారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ‌ బై పోల్ జ‌రిగేలా చేశారు. నిజా నికి ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు మేర‌కు ఏ పార్టీకీ మేజిక్ ఫిగ‌ర్ రాలేదు. అయినా కూడా కూట‌మిగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని జేడీఎస్-కాంగ్రెస్ నిర్ణ‌యించుకున్నాయి. దీనికి గండికొట్టి ప్ర‌జా తీర్పును అప‌హాస్యం చేసి క‌ర్ణాట‌క‌లో క‌మలం రేకులు విప్పింది. ఇక‌, త‌ర్వాత ఇటీవ‌ల కాలంలో మ‌ధ్య ప్ర‌దేశ్‌లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఏర్ప‌డింది. 


2018లో మ‌ధ్య ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ వచ్చింది. అయిన‌ప్ప‌టికీ.. క‌లిసి వ‌చ్చిన మిత్ర‌ప‌క్షాలతో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకుంది. కాంగ్రెస్ నేత క‌మ‌ల్‌నాథ్ సీఎం సీటు ఎక్కారు. ఇది రెండేళ్లు కూడా జ‌ర‌గ‌క‌ముందుగానే బీజేపీ రంగంలోకి దిగింది. నేత‌ల మ‌ధ్య చిచ్చు రేపింది. దీంతో కాంగ్రెస్‌లో కీల‌క‌మైన జ్యోతిరాధిత్య సింధియా.. నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసి.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న‌ట్టు ప్ర‌క‌రించారు. ఈక్ర‌మంలోనే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు(కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ) క‌మ‌ల్ నాథ్ ప్ర‌భుత్వానికి తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌క‌రించారు. ఈ క్ర‌మంలోనే 2020 మార్చి 20న సాయంత్రం 5 గంట‌ల‌కు క‌మ‌ల్ నాథ్‌(కాంగ్రెస్) ప్ర‌భుత్వాన్ని మ‌ద్ద‌తు నిరూపించుకోవాల‌ని కోర్టు ఆదేశించింది. 


దీంతో బీజేపీ ప‌న్నాగాన్ని ప‌శిగ‌ట్టిన క‌మ‌ల్‌నాథ్‌.. త‌న ప్ర‌బుత్వానికి మ‌ద్ద‌తు లేద‌ని గ్ర‌హించి, బ‌ల‌నిరూప ‌ణ‌కు ముందుగానే మ‌ధ్యాహ్నం.. 12 గంట‌ల స‌మ‌యంలోనే ఆయ‌న రాజీనామా చేశారు. అనంత‌రం .. బీజే పీ అధికారంలోకి వ‌చ్చింది. నిజానికి దీనికి ప్ర‌భుత్వంలో ఉన్న బీజేపీపై తీవ్ర వ్య‌తిరేక‌త తోనే ఇక్క‌డ ప్ర‌జ ‌లు కాంగ్రెస్ కూట‌మిని గెలిపించారు. అయిన‌ప్ప‌టికీ.. బీజేపీ త‌న అధికార దాహంతో మ‌ధ్య ప్ర‌దేశ్‌లో మ ధ్యంత‌రంగా అధికారంలోకి రావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు రాజ‌స్థాన్‌లోనూ బీజేపీ త‌న అధికార దాహా న్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వం ఉంది. ఈ ప్ర‌భుత్వంలో కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీకి అత్యంత స‌న్నిహితుడైన‌.. స‌చిన్ పైల‌ట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. 


అయితే, మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌నుకున్న బీజేపీ..  త‌న అధికారం పోయే స‌రికి ఏదో ఒక‌ర‌కంగా ఇక్క‌డ పాగా వేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలోనే స‌చిన్ పైలెట్‌ను త‌న‌కు అనుకూలంగా మా ర్చుకుంది. ఆయ‌న వెనుక 30 మంది వివిధ పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేలు ఉండ‌డంతో ఆయ‌న‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే, ఇక్క‌డ చిన్న ట్విస్ట్ ఉంది. స‌చిన్ సీఎం కావాల‌నేది ప్ర‌ధాన కోరిక‌. అయితే, దీనికి బీజేపీ ఒప్పుకొన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. దీంతో ప్ర‌స్తుతం ఈ ఊగిస‌లాట కొన‌సాగుతోంది. త్వ‌ర‌లోనే రాజ‌స్థాన్ రాజ‌కీయం కీల‌క మ‌లుపు తిరుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైన‌ప్ప‌టికీ.. బీజేపీ అధికార దాహం.. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: