అవును! ఇప్పుడు వైసీపీలో ఇదే చ‌ర్చ జోరుగా సాగుతోంది. వైసీపీ నేత‌లు ఫోన్లు చేసుకుని మ‌రీ చెవిలో చి న్న‌గా చ‌ర్చించుకుంటున్నారు. `ఎల్లో మీడియా ఇంత సిల్లాగా రాసిందేంట‌బ్బా!` అని గుస‌గుస లాడు తు న్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌న‌కున్న స‌ల‌హాదారుల్లో కీల‌క‌మైన‌.. అజేయ‌క ‌ల్లం రెడ్డి, పీవీ ర‌మేష్‌లకు ఉన్న బాధ్య‌త‌ల‌ను త‌గ్గించి, స‌బ్జెక్టుల‌ను కూడా మార్చింది. వాస్త‌వానికి ఏ ప్ర‌భుత్వ ‌మైనా.. త‌మ స‌ల‌హాదారుల విష‌యంలో ఎవ‌రు దేనికి ప‌నికి వ‌స్తార‌నుకుంటే.. వారిని అక్క‌డ నియ‌మిం చు కుంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో వారి పోస్టుల‌ను కూడా స‌బ్జెక్టుల‌ను కూడా త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తుంటా రు. 


అదే నేప‌థ్యంలో ఏపీలోనూ ప్ర‌భుత్వ స‌ల‌హాదారులుగా ఉన్న అజేయ‌క‌ల్లం రెడ్డి, పీవీ ర‌మేష్‌ల‌కు ఉన్న బా ధ్య‌త‌ల‌ను ప్ర‌భుత్వం త‌గ్గించింది. అయితే, ఏదో ఒక విధంగా ప్ర‌భుత్వాన్ని, ప్ర‌భుత్వ ప‌రువును రోడ్డు కు లాగాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న ఎల్లో మీడియా.. దీనిని కూడా రాజ‌కీయం చేసేసింది. అయితే, ఈ రాజ‌కీ యానికి అజేయ క‌ల్లం రెడ్డి ప‌డ‌లేదు. పీవీ ర‌మేష్ కూడా ప‌ట్టించుకోలేదు. నిజానికి వాళ్లు త‌మ త‌మ స‌ర్వీ సుల్లో ఎన్ని మీడియాల‌ను చూసి ఉంటారు? ఎంత‌మందిని చ‌ద‌వి ఉంటారు?  సో.. ఈ ప‌చ్చరాత‌ల‌కు ప‌డి పోలేదు. దీంతో ఒక్క‌సారిగా దిమ్మతిరిగిన ఎల్లో మీడియా.. ఈ క‌థ‌నంలో మ‌సాల‌ను మ‌రింత పెంచింది. 


ఈ సారి అజేయ‌క‌ల్లం రెడ్డిని ప‌క్క‌న పెట్టి.. కేవ‌లం పీవీ ర‌మేష్‌ను భుజాన వేసుకుంది ఎల్లో మీడియా.. స‌ల హా దారుల శాఖ‌ల కుదింపు.. ప‌నిత‌గ్గింపు విష‌యంలో ``అస‌లు టార్గెట్ పీవీ ర‌మేష్‌`` అంటూ  ఎల్లో మీడి యా ఓ క‌థ‌నాన్ని వండి వార్చింది. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌మేష్ ఏ సామాజిక వ‌ర్గానికి చెందిన అధికారో ప్ర‌జ‌ల‌కుతెలియ‌దు. ప‌నిచేసే వారికి సామాజిక వ‌ర్గంతో ప‌నేముంటుంది. అయితే, ఇప్పుడు ఎల్లో మీడియా ఈ ర‌గ‌డ‌కు కులాన్ని అంటించేసింది.  సీఎంవోలో ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే, కేవలం దళిత సామాజిక వర్గానికి చెందిన పీవీ రమేశ్‌ను తొలగించేందుకే జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ.. ఓ క‌థ‌నాన్ని అల్లేసింది. 


పోనీ.. ఇదే నిజం అనుకుందాం.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈయ‌న‌నే క‌దా.. జ‌గ‌న్ నెత్తిన పెట్టుకున్నారు. పో నీ.. ఈయ‌నేమ‌న్నా.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం హ‌యాంలో స‌ల‌హాదారుగా నియామ‌కం పొంద‌లేదు క దా? జ‌గ‌న్ ఏరికోరి ఆయ‌న‌ను తెచ్చుకున్నారు. కానీ, ఎల్లో మీడియా మాత్రం ముందుగా స్టిక్ట‌ర్ అంటించే సింది. ఇక‌, ఇదేస‌మ‌యంలో .. పీవీర‌మేష్‌ను ప‌క్క‌న పెట్ట‌డానికి కార‌ణాలు అంటూ.. రెండు పాయింట్లు చెప్పుకొచ్చింది.  రాష్ట్రం లో కరోనా నిర్వహణకు సంబంధించి జాతీ య మీడియాలో పీవీ రమేష్‌‌ చాలా పాపులర్‌ అయ్యారని,  చాలా సార్లు ఆయన సేవ‌ల‌కు ప్రశంసలు దక్కాయ‌ని, ‘మీరు ప్రధాని కార్యాలయం (పీఎంవో)లో ఉండాల్సిన వారు అని జాతీయ మీడియా నుంచి ప్రశంసించిన‌ట్టు ఎల్లో మీడియా చెప్పింది. 

 

దీంతో  జగన్ త‌న‌‌ సర్కారుకు దక్కాల్సి న ప్రశంసలు దళిత సామాజిక వర్గానికి చెందిన ర‌మేష్ అనే ఓ అధికారికి దక్క‌డాన్ని స‌హించ‌లేక ఇప్పుడు ఆయ‌న కుప‌నిత‌గ్గించార‌ని, ఇది పూర్తిగా ద‌ళిత మేధావిని అవ‌మానించిన‌ట్టేన‌న్న‌ది ఎల్లో మీడియా సారాంశం. ఇక‌, రెండో కార‌ణం చూద్దాం.. జగన్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ సచివాలయాల వ్యవస్థకు పీవీ రమేశ్‌ పూర్తి వ్యతిరేకి. ఏ సదుపాయం, ఏ టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో వందేళ్ల కింద గాంధీజీ చెప్పిన ఈ సూచన ప్రస్తుత కాలానికి అంతగా ఉపయోగపడదని పీవీ ర‌మేష్‌ తన అభిప్రాయంగా చెబుతుండేవారు. ఇది న‌చ్చ‌ని జ‌గ‌న్ ఇప్పుడు ఆయ‌నకు ఉన్న శాఖ‌ల‌ను త‌గ్గించార‌ని బ‌హుచ‌క్క‌గా అల్లేసింది. 


అయితే, ఏ మాత్రం క‌నీస ప‌రిజ్ఞానం ఉన్నా.. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నులు చూస్తున్నా.. ఇవ‌న్నీ సిల్లీగా అనిపించ‌డం లేదా?  ఈ రెండు కార‌ణాల‌తోనే పీవీ ర‌మేష్ కు ఉన్న ప‌నిని త‌గ్గిస్తారా?  పీవీ ర‌మేష్ క‌న్నా ముందుగానే.. డీజీపీని కేంద్ర హోం శాఖ ప్ర‌సంశించింది. లాక్‌డౌన్ పెట్రోలింగ్ బాగుంద‌ని కీర్తించింది. మ‌రి డీజీపీని కూడా మార్చేసి ఉండాలి క‌దా?!  ఇక‌, ఎస్సీ వ‌ర్గానికి చెందిన మేధావి కాబ‌ట్టి అవ‌మానించా ర‌ని అనుకుంటే.. ఆయ‌న‌ను స్వ‌యంగా తెచ్చి పెట్టుకున్న‌దే జ‌గ‌న్‌. కాబ‌ట్టి ఈ వాద‌న‌లోనే ప‌స‌లేదు. ఈ ప‌రిణామాల‌తో ఎల్లో మీడియా.. క‌థ‌నం తేలిపోయింది. దీంతో ``ఎల్లో మీడియా ఏంటి బ్ర‌ద‌రూ.. ఇంత సిల్లీగా రాసేసింది!`` అని వైసీపీ నేత‌లే చ‌ర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: