ఇప్పుడు ఈ మాట‌లే వైఎస్సార్ సీపీ నేత‌ల చెవుల్లో చిన్న‌మాట‌గా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో జ‌రుగుతు న్న రాజ‌కీ య ప‌రిణామాలు.. ప్ర‌భుత్వ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వైఎస్సార్ సీపీ నేత‌లు ఈ విష‌యాల ‌పైనే చ‌ర్చించుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త‌పైనే పెను ప్ర‌మాదం పొంచి ఉంద‌ని చ‌ర్చిం చుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం శాస‌న మండ‌లికి జ‌రిగిన ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు జ‌గ‌న్ వ్యూహా త్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. ఈ ఖాళీ అయిన వాటికి ప‌లువురు నేత‌ల పేర్లు కూడా వినిపిస్తున్నా యి. వీరిలో కీల‌కంగా వినిపిస్తున్న పేరు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. 


గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌రం టికెట్‌ను 2019లో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ త్యాగం చేశారు. దీంతో ఆయ‌న‌ను ఏకంగా త‌ను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కేబినెట్‌లోకి ప్ర‌మోట్ చేస్తాన‌ని వైఎస్సార్ సీపీ అధినేత‌, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ హామీ ఇచ్చి కూడా దాదాపు రెండేళ్లు అవుతోంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర్రిని ప‌ట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ఖాళీ అయిన మండ‌లి స్థానానికి ఆయ‌న‌ను ప్ర‌మోట్ చేస్తున్నార‌నే ప్ర‌చారం అధికార పార్టీలోనే ఎక్కువ‌గా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో చెవిలో చిన్న‌మాట అంటూ.. `ఇలా చేస్తే.. జ‌గ‌న్ బ్యాడైపోరా..?`` అని వైఎస్సార్ సీపీ నాయ‌కులే చ‌ర్చించుకోవ‌డం ఆస‌క్తిగా మారింది. 


దీనికి ప్ర‌ధాన కార‌ణం.. కేంద్రం తీసుకునే `ర‌ద్దు నిర్ణ‌యం` అనే క‌త్తి ఏపీ శాస‌న మండ‌లిపై వేలాడుతోంది. మండ‌లిలో మూడు రాజ‌ధానుల బిల్లు, ఏపీసీఆర్‌డీఏ చ‌ట్టం ర‌ద్దు బిల్లుల విష‌యంలో మండ‌లిలో చెర‌లే రిగి ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో అస‌లు మండ‌లి ఎందుక‌ని తృణీక‌రించిన జ‌గ‌న్‌.. దీనిని ర‌ద్దు చేసే దిశ‌గా అసెం బ్లీలో తీర్మానం చేశారు. దీనిని కేంద్రానికి పంపారు. ప్ర‌స్తుతం క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌ర‌గ‌లేదు. జ‌రిగి ఉంటే.. మండ‌లి ర‌ద్దుపై ఏదో ఒక నిర్ణ‌యం వెలువ‌డేది. ఇప్ప‌డైనా త్వ‌ర‌లోనే జ‌రుగుతాయ‌ని అంచ‌నాలుఉన్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో మండ‌లి ర‌ద్దు బిల్లుకు ఓకే చెబుతార‌ని స‌మాచారం. 


మ‌రి ఇదే జ‌రిగితే.. మర్రి రాజ‌శేఖ‌ర్ వంటి జ‌గ‌న్‌కు, వైఎస్సార్ సీపీకి అత్యంత విశ్వాస‌పాత్రుడిని కేవ‌లం మండ‌లి పంపించామ‌నే పేరు త‌ప్ప జ‌గ‌న్‌కు కానీ, మర్రికి కానీ మిగిలేది ఏంటి? ఈయ‌న ఇటు నుంచి ఎన్నికై.. మండ‌లికి వెళ్లి.. ప‌ట్టుమ‌ని మూడు శుక్ర‌వారాలు కూడా గ‌డ‌వ‌క‌ముందే.. మండ‌లి ర‌ద్ద‌యితే.. జ‌గ‌న్‌కు బ్యాడ్ నేమ్ రాదా?! ఆయ‌న టికెట్ లాక్కుని, ఆయ‌న‌కు ఆశ పెట్టి, మంత్రిని చేస్తామ‌ని, చివ‌రికి రేపోమాపో ర‌ద్ద‌వుతుంద‌ని తెలిసి కూడా తాము తృణ‌ప్రాయంగా భావించిన‌ మండ‌లికి జ‌గ‌న్ .. మర్రి వంటి సీనియ‌ర్‌ను పంపించార‌నే విమ‌ర్శ‌లు రాకుండా ఉంటాయా? అని వైఎస్సార్ సీపీ నేత‌లు చెవిలో చిన్న‌గా చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి. త‌ర్వాత ప‌రిణాలు ఎలా ఉంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: