కొత్త కొత్త పరిశోధనల్లో కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. ఒక దేశం లోని ప్రజలమెదడు కి  మరొక దేశం లోని ప్రజల మెదుడు కి పరిమాణం లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు  విదేశీయుల మెదళ్లతో పోల్చితే...  మన భారతీయుల మైండ్లు చిన్నగా ఉన్నట్లు తేలింది.

అందుకు కారణమేంటో తెలుసుకుందాం IIIT హైదరాబాద్ పరిశోధకులు మొట్ట  మొదటిసారిగా ఇండియన్ బ్రెయిన్ అట్లాస్ తయారుచేస్తున్నారు. ఈ పరిశోధనలో తేలిందంటంటే... అమెరికా లాంటి పశ్చిమ దేశాలు, జపాన్ లాంటి తూర్పు దేశాల ప్రజలతో పోల్చితే...మన  భారతీయుల మెదళ్లు పొడుగు, వెడల్పూ తక్కువగా ఉన్నాయి. బరువు కూడా తక్కువే. ఈ పరిశోధన వల్ల అల్జీమర్స్, ఇతర మతిమరపు లాంటి  వ్యాధుల్ని ముందుగానే కనిపెట్టడం వీలవుతుందని పరిశోధకులు తెలిపారు.

ఈ రీసెర్చ్‌ వివరాల్ని న్యూరోలజీ ఇండియా జర్నల్‌లో రాశారు. కొత్తగా తెలిసిన అంశాలతోపాటూ... భారతీయుల బుర్రలకు సంబంధించి మరింత లోతుగా తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ బ్రెయిన్ అట్లాస్‌ను తయారుచేసేందుకు మరో 100 మంది ఆసక్తి ఉన్నవారిని చేర్చుకోబోతున్నారు.మాంట్రియల్ న్యూరోలాజికల్ ఇన్‌స్టిట్యూట్‌ (MNI)లో బ్రెయిన్‌కి సంబంధించిన టెంప్లేట్ ఉంది.

అది ప్రపంచంలో చాలా మందికి ఉండే సగటు మెదడు నిర్మాణం. చైనా, కొరియాలో కూడా ఇలాంటివి ఉన్నాయి. వాటితో పోల్చితే... భారతీయుల మెదళ్లు చిన్నవిగా ఉన్నాయి. ఐతే... ఇప్పటివరకూ భారతీయుల మెదళ్లకు సంబంధించిన మ్యాప్ లేదు. ఇప్పుడు 50 మంది పరిశోధకులు కలిసి భారతీయుల బ్రెయన్ టెంప్లేట్‌ని తయారుచేశారు. పశ్చిమ ఆసియా దేశాల మెదళ్లతో పోల్చితే... ఇండియన్స్ మెదళ్లు... కాస్తంతా చైనా, కొరియా బ్రెయిన్లకు దగ్గరగా ఉన్నాయని పరిశోధనలో తేలింది.కాలం గడుస్తున్నకొద్దీ... మనుషుల బ్రెయిన్స్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. ఆసియా దేశాల ప్రజల మెదళ్లు నానాటికీ చిన్నగా అవుతున్నాయి. ఈ మార్పు ప్రభావం మనుషుల వయసు, జ్ఞాపకశక్తి వంటివాటిపై పడుతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు చేస్తామంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: