తెలంగాణలో  ఆర్టీసీ సమ్మె 25వ రోజుకు చేరింది. ప్రజలు ఆర్టీసీ సమ్మె వల్ల నానా అవస్థలు పడుతున్న విషయం మనందరికీ తెలిసినదే. ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చాలని హైకోర్టు కూడా గవర్నమెంట్ ని సూటిగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఉద్యోగులకి ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వాళ్ళని తీసుకుని అద్దె బస్సులు నడిపిస్తూ ఉంది. కానీ వారికి ఎటువంటి పరీక్ష పెట్టకుండానే విధుల్లోకి తీసుకుంటున్నారు. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ విషయంపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.


ఈ క్రమంలో తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఖమ్మం జిల్లా బోనకల్ క్రాస్ రోడ్డులో ఓ బార్‌లోకి ఆర్టీసీ బస్సు దూసుకుని వెళ్లింది. అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు ప్రభుత్వం పట్టుదల వీడకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల బస్సు ప్రమాదాలు జరిగి, బస్సులు డ్యామేజ్ అవుతున్నాయి. మరికొన్ని చోట్ల ఏకంగా ప్రాణాలు కూడా పోతున్నాయి.


తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ గత 25 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే, విధులకు హాజరుకాని వారంతా సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో వ్యవహారం హైకోర్టుకు చేరింది. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కార్మికుల వాదనలు విన్న న్యాయస్థానం.. తొలుత ఏదో ఒక దశలో చర్చలను ప్రారంభించాలని సూచించింది. విలీనం కోసం కార్మికులు పట్టుబట్టకుండా మిగిలిన అంశాలపై చర్చలు జరిపితే కార్మికుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని అభిప్రాయపడింది.


అదే సమయంలో ప్రభుత్వానికి కూడా కోర్టు మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే.. ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది.తెరాస మంత్రులు కూడా వీలు అయిన అంత వరకు ఈ సమ్యస త్వరగా  తీర్చాలి అన్ని కోరుకుంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: