జంతువులు మనుషులు కాపాడడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కానీ జంతువులు ఒక భవనాన్ని కూడా కాపాడిన విషయం ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది.కాలిఫోర్నియా లోని  రొనాల్డ్ రీగన్ లైబ్రరీ భవనం చుట్టూ పెరిగిన చెత్త, మొక్కలు, గడ్డి వంటి వాటిని తొలగించే ఉద్దేశంతో, మే నెలలో 500 మేకలను అద్దెకు తెచ్చుకుంది.లైబ్రరీ భవనం చుట్టూ పెరిగిన మొక్కలు, ఎండిన గడ్డి వంటి వాటిని ఈ మేకలు కొద్దిరోజుల్లోనే పూర్తిగా తినేశాయి. దీంతో ప్రస్తుతం కాలిఫోర్నియాను అతలాకుతలం చేస్తున్న దావానలం ఈ భవనాన్ని చుట్టుముట్టే ప్రమాదం చాలావరకూ తగ్గిపోయింది.అంతేకాకుండా, ఫైర్‌ఫైటర్లకు తమ ప్రణాళికలను అమలుచేసేందుకు కొంత సమయాన్ని కూడా ఇచ్చినట్లైంది.


కాలిఫోర్నియా సమీపంలో ఉన్న ఈ లైబ్రరీకి ప్రస్తుతం వ్యాపిస్తున్న మంటలతో ప్రమాదం పొంచి ఉంది. ఈ మంటల కారణంగా రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారుస్కాట్ మోరిస్ అనే వ్యక్తి ఈ కంపెనీని గత నవంబరులో స్థాపించారు. ఒక ఎకరం భూమిని మేకలతో శుభ్రం చేయించాలంటే 1000 డాలర్లు (దాదాపు 70000 రూపాయలు) వసూలు చేస్తారు.


కాలిఫోర్నియాలో మరిన్ని అగ్నికీలలు వ్యాపించే అవకాశం ఉండటంతో, తమ మేకల మందలకు డిమాండ్ పెరుగుతోందని, అందుకే వాటి సంఖ్యను రెట్టింపు చేయాలనుకుంటున్నానని మోరిస్ తెలిపారు.కాలిఫోర్నియాలోని మరో పెద్ద సంస్థ, లాస్ ఏంజెలిస్‌లో ఉన్న గెట్టీ మ్యూజియం చుట్టూ ఉన్న ఆకులు, మొక్కలను కూడా ఈ వారంలో మా మేకల మంద తినేసి, శుభ్రం చేసిందని ఆయన అన్నారు.పశువుల కాపరులు, కొంతమంది వాలంటీర్లు పశువులను ట్రాలీల్లో, వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీలైనన్ని సార్లు తిరుగుతూ ఎక్కువ జంతువులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఇళ్ల యజమానులతో పాటు వారి పెంపుడు జంతువులు కూడా ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయి. మరికొన్ని జంతువులు చనిపోయాయి, కొన్ని కనిపించకుండా పోయాయి.కాలిఫోర్నియాలో ప్రస్తుతం పదికి పైగా దావానలాలు క్రియాశీలంగా ఉన్నాయి. వాటిలో ఉత్తర దిశగా వ్యాపిస్తున్న కింకేడ్ ఫైర్ అతి పెద్దది. దీని కారణంగా ఇప్పటికే 76000 ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: