తెలుగు కుర్రాడు కాచం ప్రణీత్ అరుదైన రికార్డు సాధించాడు. 21ఏళ్లకే అందర్నీ ఆశ్చర్యపరిచే టాలెంట్ తో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్-ఇంజినీరింగ్ విభాగంలో అత్యధిక సీజీపీఏ సాధించాడు. రాష్ట్రపతి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.


ఈ కాచం ప్రణీత్ స్వస్థలం.. సిద్దిపేట. నాన్న శేఖర్ ఛార్టెడ్ అకౌంటెంట్. అమ్మ లత గృహిణి. ఐఐటీలో నాలుగేళ్లలో కలిపి పది సీజీపీఏకు గాను 9.929 సీజీపీఏ సాధించాడు. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 100 మంది విద్యార్థులు తుది సంవత్సరంలో వివిధ విభాగాల్లో చదువుతుంటారు. అత్యంత ప్రతిభ చూపే విద్యార్థికి తుది సంవత్సరం పూర్తయినతర్వాత రాష్ట్రపతి బంగారు పతకం అందజేస్తారు.


అలాంటి అరుదైన ఘనత సాధించాడీ తెలుగు కుర్రాడు. స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ శివన్ నుంచి బంగారు పతకం అందుకున్నాడు. ప్రస్తుతం కాచం ప్రణీత్ ఢిల్లీ ఐఐటీలో పీహెడీ చేశాడు. ప్రస్తుతం అమెరికాలోని పిట్స్బర్గ్ నగరంలోని ప్రఖ్యాత కార్నేగీ మిలెన్ విశ్వవిద్యాలయంలో సీటు సాధించాడు. మూడు నెలలుగా అక్కడే ఉంటూ కంప్యూటర్ సైన్స్ లో 'అల్గారిథమ్'లపై పరిశోధన చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: