విశాఖ జిల్లా మునగపాకకు చెందిన పెంటకోట సన్యాసిరావు ముంచంగిపుట్ట మండల వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె దివ్య(22) అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ పూర్తిచేసింది. దివ్య కో మంచి సంబంధం వచ్చింది అని వాళ్ళ నాన్నగారు త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుంది అని తలంచి ఒక మంచి సంబంధం చూసాడు.


చైతన్య అనే యువకుడితో మే 18వ తేదీన ఘనంగా వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.4లక్షల కట్నం, 12తులాల బంగారంతో పాటు మరో లక్ష రూపాయల దీనికి తీసుకోడువిలువైన సారె అందజేశారు. అయితే పెళ్లయిన నెలరోజులకే దివ్యకు అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. దీనికితోడు అత్తమామల వేధింపులు కూడా కారణం అయ్యింది.


దివ్య చాలా మనస్థాపానికి గురి అయింది.అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేక పెళ్లయిన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకుని కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. వరకట్నపు చావులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. వీటిని అడ్డుకోవడానికి ఎన్ని చట్టాలు చేసినా ప్రయత్నము మాత్రము వృధా అవుతున్నది. దీని వలన ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు బలిఅవుతున్నాయి ఈ ఈ క్రమంలోనే పది రోజుల కిత్రం భర్త దివ్యను కొట్టి పుట్టింటికి పంపేశాడు.


అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్న దివ్య డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగేసింది. ఈ విషయాన్ని గమనించిన తల్లి పూర్ణ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. ఆమెను కారులో హుటాహుటిన అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో దివ్య ప్రాణాలు కోల్పోయింది.దివ్య మరణానికి అత్తింటి వారే కారణమని దివ్య తండ్రి  సన్యాసిరావు అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దివ్య మరణానికి వారి యొక్క తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: