ఒక్కొక్కరు ఎంత సంపాదించినా 10 పైసలు ఖర్చు పెట్టడానికి వెనుకాడే  రోజులు ఇవి. ఇలాంటి తరుణంలో ఒక పెద్దాయన తను కష్టపడి సంపాదించిన సొమ్మును దేశ సేవకు  ఉపయోగించాడువిశ్వనాథంను అభినందిస్తున్న  సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్‌ ఆయన సంపన్నుడేం కాదు.. కష్టపడితేనే కడుపు నిండుతుంది. కానీ సమాజ శ్రేయస్సును కోరుకున్నాడు.. జీవితమంతా గడిపింది చిరు వ్యాపారిగానే.. కానీ గుణంలో మాత్రం భారీ ఉదారతను చాటుకున్నారు.. 


తాను వృద్ధాశ్రమంలో ఉంటూ.. కష్టపడి సంపాదించిన రూ.50 లక్షలను భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లికి చెందిన సిరిపురం విశ్వనాథం గుప్తా. సోమవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి తన కష్టార్జితం నుండి రూ.50 లక్షలను సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి అందించాలని కోరుతూ చెక్‌ అందజేశారు.

78 సంవత్సరాల వయసులో, మట్టపల్లిలోని వృద్ధాశ్రమంలో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు.ఆయన సంపన్నుడేం కాదు.. కష్టపడితేనే కడుపు నిండుతుంది. కానీ సమాజ శ్రేయస్సును కోరుకున్నాడు.. జీవితమంతా గడిపింది చిరు వ్యాపారిగానే.. కానీ గుణంలో మాత్రం భారీ ఉదారతను చాటుకున్నారు.. విశ్వనాథ్ గారు చరమాంకంలో దేశంకోసం పోరాడుతున్న సైన్యం, వారి కుటుంబాలకు నాకు తోచిన సహాయం చేయాలని పించింది.


మిత్రుడు లక్ష్మణరావు సహకారంతో సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్‌ను సంప్రదించి రూ.50 లక్షలను గవర్నర్‌ చేతుల మీదుగా సైన్యానికి విరాళమిచ్చా.. ఈ రోజు చేసిన పనే నాకు అత్యంత సంతృప్తిని కలిగిస్తోంది’ అని విశ్వనాధ గారు తెలిపారు. నేను అనేక దేవాలయా లకు కు, అన్న సత్ర లకు కూడా ఎంతో దానం చేశాను అని చెప్పారు. తాను చిన్న వ్యాపారం చేసే తను సంపాదించిన సొమ్ము 50 లక్షల రూపాయలు సైనిక సంక్షేమ పథకాన్ని కి ఇవ్వడం చాలా గొప్ప విశేషము.


మరింత సమాచారం తెలుసుకోండి: