
- venky-mama-movie
- 2019
- 2020
- priyanka
- media
- alia bhatt
- malaika arora
- death penalty to rapists
- baksar prison
- नागरिकता बिल
- imported onions
- protest against citizenship amendment bill
- pawan jallad
- court
- old clothes
- margashirsha purnima 2019
- प्रियंका चोपड़ा और निक जोनास
- amazon
- deepika padukone legendary cricketer
- deepika padukone
- bhaskar

మనం స్టార్ హోటల్ కు వెళితే నక్షత్రాలు హోటల్ లో కనిపించవు..బిల్లు కట్టేటప్పుడు కష్టమర్ కు కచ్చితంగా కనిపిస్తాయి. అటువంటి సందర్భం దాదాపు స్టార్ హోటల్ కు వెళ్లినవారికి తెలుస్తునే ఉంటుంది. ఇప్పుడు తాజాగా..కేవలం మూడు కోడి గుడ్లకు రూ. 100 రూ.200లు కాదు ఏకంగా రూ. 1672 బిల్ వేసింది ఎవరికో కాదు..‘బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రావ్ జనీకి. ఈ బిల్లు చూసిన శేఖర్ రావ్ జనీకి నిజంగా చుక్కలు కనిపించాయి.
వివరాలు ఇలా.. బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రావ్ జనీ అహ్మదాబాద్ లోని హోటల్ హయత్ రెజెన్సీ 5స్టార్ హోటల్లో బస చేశారు. ఈ క్రమంలో శేఖర్ గురువారం (నవంబర్ 14)న మూడు బాయిల్డ్ ఎగ్ లు ఆర్డర్ ఇచ్చారు. వెంటనే ఫుడ్ ను సరఫరా చేసిన సదరు హయత్ రెజెన్సీ హోటల్ సప్లయర్ మూడు బాయల్డ్ ఎగ్స్ ను తెచ్చి ఇచ్చాడు. వాటితో పాటు శేఖర్ చేతిలో రూ.1672 రూపాయల బిల్లు కూడాపెట్టాడు. ఆ బిల్లు చూసిన శేఖర్ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
వ్యాట్..త్రీ ఎగ్స్ కదా నేను ఆర్డర్ చేసింది రూ.1672 రూపాయల బిల్లు ఏంటీ అంటూ తెగ ఆశ్చర్యపోయాడు. అప్పుడు నిజంగా ఆయనకు చుక్కలు కనిపించాయి. దీంతో నోటి నుంచి మాట కూడా రాలేదు పాపం మ్యూజిక్ డైరెక్టర్ కు. కానీ ఆయన చెవుల్లో మాత్రం ఒక రకమైన మ్యూజిక్ వినిపించే ఉంటుంది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ట్విట్టర్లో షేర్ చేశారు.
అదే మరి 5 స్టార్ హోటలా మజాకానా..బిల్ చూస్తే స్టార్స్ కనిపించాల్సిందే అనేలా ఉంది ఈ ఘటన. కాగా గతంలో రెండు అరటిపండ్లు తీసుకురమ్మని ఆర్డర్ ఇచ్చిన బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్కి ఓ ఫైవ్ స్టార్ హోటల్ రూ.442.50 బిల్లు వేసిన విషయం తెలిసిందే.
Please do not make derogatory comments, comments those attack any person directly, indirectly, comments those create societal pressures, comments those are not ethical & moral. Please do support us to moderate and remove the comments which doesn't fit to this comment policy - India Herald Group