పెద్ద నగరాలకు మాత్రమే పరిమితి అయిన పాశ్యాత్య విష సంస్కృతి ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి కి కూడా పాకింది. మసాజ్‌లు, స్పాల పేరుతో నడుస్తున్న వ్యభిచార దందా వెలుగుచూసింది. అందమైన యువతులతో మసాజ్‌లంటూ నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార ముఠాల గుట్టురట్టైంది. జిమ్‌లు, స్పాల పేరుతో అనుమతులు తీసుకుని హైటెక్ తరహా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాలములో ప్రజలు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి అన్న ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు.

 

ఇలా సంపాదించడానికి ఏదో ఒక మార్గము వెతుక్కోవాలి . అందుకు పలు రకాలైన అడ్డదారులు తొక్కుతున్నారు. జిమ్‌లు, స్పాల పేరుతో అనుమతులు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బయటికి చూడడానికి జిమ్ములకు, స్పాలకు వెళ్తున్నారా అనేసి అనుకుంటాము. కానీ అందులో నడుస్తున్నది వ్యభిచారం అనేసి మనలో ఎంతమందికి తెలుసు.

 

  మెట్రోపాలిటన్ నగరాలకు మించిపోతోంది విజయవాడ. వీధికో స్పా, సెంటర్‌కో మసాజ్ పార్లర్లు ఏర్పాటవుతున్నాయి. ఖరీదైన భవనాలు అద్దెకు తీసుకుని స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో హైటెక్ వ్యభిచార దందాకు తెరతీస్తున్నారు నిర్వాహకులు. జిమ్‌ల పేరుతో కూడా కొన్ని వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరగడంతో విజయవాడ పోలీసులు దాడులు నిర్వహించారు. స్పాలు, జిమ్‌లపై దాడులు నిర్వహించి వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు..స్పా, మసాజ్ సెంటర్లలో వ్యభిచారం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు తెలిపారు.

 

పోలీసు దాడుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలినట్లు ధ్రువీకరించినట్లు సమాచారం. అలాగే పలువురు యువతులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది యువతీ యువకులు తమ విలాసాలకు ఏ పని అయినా చెయ్యడానికి ముందుకు వస్తున్నారు.ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు బయటపడితే ఎంత ప్రమాదమో వారికి అర్థం కావడం లేదు.ఈ వ్యభిచార దందాను ఉపేక్షించేంది లేదని.. సమగ్ర విచారణ జరిపిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: