మూడు రోజుల  క్రితం జరిగిన బయోడైవర్సిటీ సంఘటన మరవక ముందే మరో ఆక్సిడెంట్ హైదరాబాద్‌‌లో  వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయ  ఆందోళనలకు గురి  చేస్తున్నాయి . ఐదు రోజుల వ్యవధిలో నాలుగు ప్రమాదాలు కలవరపెట్టాయి.. ఈ ప్రమాదాలు మర్చిపోకముందే మరో సంఘటన  కలకలంరేపుతోంది . తాజాగా ఎల్బీ నగర్‌ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదం వాళ్ళ  ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి  .. వెంటనే అక్కడ ఉన్న  స్థానికులు స్పందించి  హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిని వెంకటమ్మ, సత్తెమ్మలుగా గుర్తించారు.

 

ఈ ప్రమాదం దిల్‌సుఖ్ నగర్-ఎల్బీనగర్ మార్గంలో జరిగింది హఠాత్తుగా  ఒక  కారు అతివేగంతో వచ్చింది .. అదే సమయంలో రోడ్డు దాటుతున్న వెంకటమ్మ, సత్తెమ్మలను ఢీకొట్టింది.  ఆ తర్వాత కారు కూడా  రోడ్డుపై పల్టీలు కొట్టి  అక్కడ ఉన్న మెట్ర డివైడర్‌ను ఢీకొట్టింది. కారు ప్రమాదంతో ఏం జరుగుతుందో అర్థం కానీ పరితుతుల్లో అక్కడే  స్థానికులు కొద్దిసేపు భయబ్రాంతులకు గురయ్యారు. 

 

వెంటనే కారు డ్రైవర్‌ను పట్టుకుని  స్థానికులు పోలీసులకు అప్పగించడం జరిగింది,పోలీసులు కారు ప్రమాదం గురించి అక్కడ ఉన్న స్థానికులని విచారించగా . ఆక్సిడెంట్ జరిగే  సమయం లో కారు చాల వేంగంగా వస్తోందని  డ్రైవర్ అతివేగం వల్లే  ఈ దుర్ఘటన జరిగింది అంటూ అక్కడే ఉన్న   ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

 

ఈ ఐదు రోజుల వ్యవధిలోనే మొత్తం నాలుగు ప్రమాదాలు జరిగాయి. హైటెక్ సిటీ సమీపంలో బయోడైవర్సిటీ దగ్గర.. నోవాటెల్ దగ్గర వరుసగా రెండు ప్రమాదాలు జరగ్గా ఆ ప్రమాద ఘటనలో  ఇద్దరు చనిపోయారు. ఈ రెండు ఘటనలు మర్చిపోకముందే.. బంజారాహిల్స్‌లో బస్సు ఢీకొట్టడంతో మరో మహిళ చనిపోయింది. తాజాగా ఎల్బీ నగర్ సమీపంలో జరిగిన ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ అతివేగం  ఇంకా ఎన్ని నిండు  ప్రాణాలను బలి తీసుకుంటుందో . అయినా ఎన్ని సంఘటనలు జరిగిన ప్రయాణికుల్లో మార్పు రావటం లేదు  

మరింత సమాచారం తెలుసుకోండి: