ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న   డిప్యూటీ సెక్రటరీ అవినీతి భాగోతం బట్టబయలు అయింది వచ్చింది. ‘రూ.10 లక్షల డబ్బులు ఇస్తే నే నీకు  పదోన్నతి వచ్చేలా చేస్తా.. కోరిన చోటుకు పోస్టింగ్‌  కూడా  ఇస్తా’ అంటూ నేరుగా ఒక వైద్యుడి క్లినిక్‌కు వెళ్లి డబ్బును  డిమాండ్‌ చేసాడు ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అవడం వలన సంఘటన వెలుగు లోకి వచ్చింది . .

 

గుంటూరు మెడికల్‌ కాలేజీలో పనిచేస్తున్న డా.వై.కిరణ్‌కుమార్‌ తనకు న్యాయంగా రావాల్సిన పదోన్నతి దక్కలేదంటూ  గత నాలుగున్నరేళ్ల పాటు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు . ఈయన ఈ విషయం పైన . జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా పదోన్నతి ఇవ్వాల్సిందేనని కమిషన్‌ తీర్పుచెప్పింది. అధికారులు మాత్రం పదోన్నతి ఇవ్వకుండా తిప్పుతూనే ఉన్నారు . దీంతో ఇటీవల అతను  ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించగా.. కిరణ్‌కుమార్‌ కేసుకు సంబంధించిన  వివరాలు ఇవ్వాలని సీఎంఓ ఆదేశించింది.

 

అయితే కిరణ్‌కుమార్‌ బావమరిది ఆనంద్‌... సచివాలయంలో ఆరోగ్యశాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసే యిర్మియా రాజును సంప్రదించి తన బావ పదోన్నతి గురించి  మాట్లాడారు  తనకు రూ.10 లక్షలు ఇస్తే నోషనల్‌ ప్రమోషన్, మళ్లీ పోస్టింగ్‌ ఇస్తానని యిర్మియా డిమాండ్‌ చేశారు. సీఎంవో కార్యాలయ ఆదేశాలు ను ఏ మాత్రం లెక్కపెట్టలేదు . ఈ విషయం అందరినీ విస్మయానికి గురిచేసింది.

 

గత నాలుగున్నర సంవత్సరాలుగా నోషనల్‌ ప్రమోషన్‌పై పోరాడుతున్నాను. విజిలెన్స్, ఎస్సీ కమిషన్‌ ఇచ్చిన ఆదేశాల్ని కూడా అమలు చేయలేదు. ఇక చేసేది ఏమి లేక   నా బావమరిది ఆనంద్‌...డిప్యూటీ సెక్రటరీ యిర్మియా రాజునుసంప్రదించడం జరిగింది . అనంతరం ఆయన నా దగ్గరకొచ్చి రూ.10 లక్షలు డిమాండు చేశారు. అడ్వాన్సుగా రూ.50వేలు ఇచ్చాను. మరో రెండు లక్షలు ఇవ్వాలని, మిగతా సొమ్ము పనయ్యాక ఇవ్వాలని అడిగారు. అలాగే ఇస్తానని చెప్పాను. అని వై.కిరణ్‌కుమార్‌  వెల్లడించారు 

మరింత సమాచారం తెలుసుకోండి: