రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణం జరిగింది   చేసుకుంది. ప్రియాంకారెడ్డి అనే యువతి వెటర్నరీ డాక్టర్‌గా పని చేస్తుంది   . పని ముగించుకొని తిరిగి వస్తుండగా గచ్చిబౌలిలో తన వెహికల్‌ పాడైపోయిందని కుటుంబసభ్యులకు ఫోన్‌ ద్వారా తెలిపింది ప్రియాంక. చుట్టు పక్కల లారీ డ్రైవర్లు ఉన్నారని భయంతో చెప్పింది.

 

ప్రియాంక ఫోన్‌ కాసేపటికే స్విచ్ఛాఫ్ అవటం తో  తల్లిదండ్రులు ఆందోళనకు గురి అయ్యి పోలిసుల కు కంప్లియెంట్ ఇచ్చారు . అయితే  వారి ఆందోళనే నిజం అయింది తెల్లవారుజామున చటాన్‌పల్లి బ్రిడ్జి కింద ప్రియాంక శవమై కన్పించింది. కిడ్నాప్‌ చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసులు నిర్ధారించారు.

 

మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సయిపల్లి గ్రామం ఆమె సొంత ఊరు  కాగా.. ప్రస్తుతం శంషాబాద్‌లో వీరి కుటుంబం నివసిస్తున్నారు  . రోజూ స్కూటీ మీద ప్రియాంకారెడ్డి విధులకు వెళ్లేది. బుధవారం కూడా విధులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆమె స్కూటీ పాడైంది. దీంతో భయపడుతూ ప్రియాంక తనచెల్లికి ఫోన్ చేసి  , భయమవుతోంది పాప నాకు. ప్లీజ్‌ కొంచెం సేపు మాట్లాడు’ అంటూ ప్రియాంకారెడ్డి ఫోన్‌లో చివరిసారిగా తన సోదరితో మాట్లాడింది.

 

వాళ్లను చూస్తుంటే భయమవుతోందని, ఏడుపు వస్తోందని తన చెల్లి భవ్యారెడ్డితో దీనంగా చెప్పింది. రాత్రిపూట రోడ్డు మీద ఒక్కదాన్నే ఉన్నానని, చాలా టెన్షన్‌గా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. కొంచెంసేపు తనతో మాట్లాడాలని సోదరిని ఫోన్‌లో కోరింది. తన స్కూటీ వెనుక టైరు పంక్చర్‌ కావడంతో అక్కడ ఉన్న లారీలోంచి ఓ వ్యక్తి వచ్చి పంక్చర్‌ వేయించుకొస్తానని బండి తీసుకెళ్లాడని ప్రియాంక చెప్పింది. తాను వెళ్లిపోతానంటే వద్దని తన వెంటబడ్డాడని భయంగా చెప్పింది.

 

సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు వెళ్లాలని ప్రియాంకకు సోదరి సూచించగా అక్కడ నిలబడితే అందరూ తననే చూస్తారని సమాధానం ఇచ్చింది. ‘చాలా భయంగా ఉంది. ఈ దెయ్యం మొహపోడు నా బండి ఇంకా తీసుకురాలేదు. ఇక్కడ అస్సలు నిలబడాలని లేదు. బైక్‌ వచ్చే వరకు కాసేపు మాట్లాడు’ అంటూ సోదరితో ఫోన్‌లో మాట్లాడింది .

 

అక్కడే ఉండవద్దని సమీపంలోని టోల్‌గేట్‌ వద్దకు వెళ్లమని తాను చెప్పినా.. వెళ్లలేదని, వెళ్లియున్నా ఈ ఘోరం జరిగేది కాదేమో అని బాధపడుతున్నారు .అంటూ ఆమె సోదరి  కన్నీరుమున్నీరవుతున్నారు. లారీ డ్రైవర్లు ఎక్కువగా సంచరించే ప్రాంతం కావడంతో వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.కావాలనే బైక్ పంక్చర్ అయ్యేట్లు చేసి ఉండవచ్చు అని అంటున్నారు  ప్రస్తుతం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: