మనం మెదడులో 10 శాతాన్ని మాత్రమే వాడుకుంటున్నామని. మిగతా 90 శాతాన్ని కూడా సానబెట్టి, వాడుకుంటే మరిన్ని తెలివితేటలతో, మరింత సృజనాత్మకంగా, విజయవంతంగా మారొచ్చుననే భావన ఎంత బావుంటుందో! కానీ, అది ఏమాత్రం నిజం కాదు.‘ఫంక్షనల్ మాగ్నటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్’ అనే సాంకేతిక పద్ధతిలో నాడీ సంబంధిత శాస్త్రవేత్తలు దీనికి సమాధానం చెప్పగలరు. ఈ పద్ధతిని ఉపయోగించి.. ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనిషి మెదడులో ఏ భాగాలు స్పందిస్తున్నాయో తెలుసుకోవచ్చు.

 

మీ పిడికిలి బిగించడం, నోటితో కొన్ని పదాలు పలకటం వంటి పనులకు మెదడులో పదో వంతు పనిచేస్తే సరిపోతుంది.మీరు ఆలోచిస్తూ మరే పనీ చేయకపోయినప్పటికీ, మీ మెదడు మాత్రం.. శ్వాస తీసుకోవటం, గుండె కొట్టుకోవటం, తర్వాత ఏం చేయాలనే వాటిని గుర్తు చేసుకోవటం వంటి చాలా పని చేస్తుంటుంది.

 

మన మెదడులోని నాడీ కణాలు ఎప్పుడూ ఖాళీగా, పని లేకుండా అలా పడి ఉండవు. కానీ, అలా జరగడానికి మాత్రం ఆస్కారం ఉంది.అసలు మన శక్తిని ఎక్కువగా వాడుకునేది మెదడే. మెదడు కణజాలాన్ని సజీవంగా ఉంచడానికి మనం పీల్చే గాలిలో 20 శాతం అవసరమవుతుందని అభిజ్ఞాన నాడీ శాస్త్రవేత్త సెర్గియో డెల్లా సల అంటారు.అయితే, 10 శాతం మెదడును మాత్రమే వాడుకుంటామని అపార్థం చేసుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయి.

 

మన మెదడులో 90 శాతం కణాలు తెల్లగా ఉండే గ్లాల్ కణాలు. ఇవి భౌతికంగాను, పోషణ పరంగానూ మెదడుకు అండదండలిస్తాయి. మిగతా పది శాతం కణాలు.. న్యూరాన్లు  బూడిదరంగులో ఉండే పదార్థం. మన ఆలోచనల సమాలోచనలు జరిగేది ఇక్కడే. బహుశా అందువల్లనే కొందరు.. మన మెదడులో 10 శాతం మాత్రమే ఉపయోగంలో ఉంది, మిగతా 90 శాతాన్ని కూడా సానబెట్టాలి అని భావిస్తుండవచ్చు. కానీ, ఈ 90 శాతం కణాలు పూర్తిగా భిన్నమైనవి. అవి ఉన్నట్టుండి న్యూరాన్లుగా మారేందుకు, మనకు మరింత తెలివితేటలిచ్చేందుకు ఆస్కారం లేదు. మిగతా 90 శాతాన్ని కూడా వాడుకుని మెరుగుపడాలన్న సానుకూల ఆలోచన కావొచ్చు. మనం మరింత మెరుగ్గా ఉండాలని భావిస్తుంటాం.ప్రయత్నిస్తే నిజంగానే మెరుగ్గా ఉండొచ్చు. కానీ, నిరుపయోగంగా ఉన్న మెదడును వాడుకుని మాత్రం కాదు. ఎందుకంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: