సూడాన్ దేశంలోని  బహ్రీ అనే పట్టణంలో  భారీ పేలుడు సంభవించినది. ఈ ఘోర ప్రమాదము లో సుమారు18 మంది భారత దేశము లోని భారతీయులు కోబర్ నైబర్‌హుడ్ అనే పారిశ్రామిక ప్రాంతంలోని సలోమీ సిరామిక్ ఫ్యాక్టరీలో పని చేసేవారు. పనిచేస్తున్నప్పుడు మంగళవారం ఎల్‌పీజీ గ్యాస్‌ ట్యాంకర్‌ పేలడం జరిగినది. ట్యాంకరు పేలడం వలన ఘోర అగ్నిప్రమాదం జరిగినది. ఈ భారీ అగ్నిప్రమాదంలో చాలామంది చనిపోవడం జరిగినది.

 

ఇంకా చెప్పలేనంత మంది క్షతగాత్రులు అయ్యారు. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం 23 మంది సజీవ దహనమయ్యారు. మరో 330 మందికిపైగా తీవ్రంగా  చాలమంది  గాయపడినట్టు తెలుస్తోంది. వీరిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియ వలసి వుంది. ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదనీ చెప్పారుకానీ 18 మంది కార్మికులుచనిపోయినట్టుగా తెలుస్తోందని భారత రాయబార కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలియ జేసింది.

 

మృతదేహాలు చాలావరకు కాలిపోవడం వలన గుర్తించడము సాధ్యం కావడం లేదని అక్కడే ప్రభుత్వమువెల్లడించింది. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొత్తము భారతీయుల జాబితాను విడుదల చేసింది. ఈ ప్రమాదంనుంచి బయటపడిన దాదాపు 34 మంది భారతీయులను సురక్షిత ప్రాంతానికి పంపినట్లు తెలిపింది. సెరామిక్స్ ఫ్యాక్టరీలో అవసరమైన భద్రతా పరికరాలు లేవని తెలిపింది. ఉన్న వస్తువులను, నిల్వ చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా  వైఫ్యలం చెందినది. దీని కారణంగానే మంటలు చుట్టుముట్టాయి అని ప్రభుత్వం ప్రకటించింది.

 

దర్యాప్తు మొదలైందని కూడా తెలియజేసింది
ఇంకోవైపు ఈ సంఘటనలో 23 మంది మృతి చెందారని, 130 మందికి పైగా గాయపడ్డారని సుడాన్ ప్రభుత్వాన్ని ఉడికిస్తూ ఏఎఫ్‌పీ నివేదిక పేర్కొంది. కానీ ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారో ఇంకా పూర్తిగా తెలియడంలేదు. కాగా ప్రమాదం తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. కానీ దేశం కాని దేశంలో ఇంత మంది భారతీయులు చనిపోవడం దురదృష్ట కరం. వారి మృతదేహాలను భారతదేశానికి పంపించవలసిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: