ఇటీవలి కాలంలో యువత తమ ప్రేమను పొందడానికి రాష్ట్రాలను దాటి ఇతర దేశాలకు కూడా పోవడానికి వెనుకాడడం లేదు.ప్రపంచంలో ప్రేమకు కులం, మతం, భాష, ప్రాంతం వంటి బేధాలు, తారతమ్యాలు లేనే లేవు. ఖండాంతరాలు, దేశాలు దాటైనా ప్రేమను గెలిపించుకుంటారు ప్రేమికులు.ఇలాంటి ప్రేమను దక్కించుకోవడానికి ఎంతో సాహసం చేయవలసి వస్తుంది. ఇవన్నీ వినడానికి సినిమా డైలాగుల్లా అనిపించొచ్చు.. కానీ అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా జరుగుతుంటాయి అనడంలో సందేహము లేదు.

 

ఇటీవల తాజాగా ఒక ఒకయువతి ప్రేమ దేశ సరిహద్దు దాటింది.ఆ అమ్మాయి ప్రేమించిన యువకుడిని కలుసుకునేందుకు పొరుగునే ఉన్న పాకిస్థాన్‌కు వెళ్లేలా చేసింది. హర్యానాలోని కైదల్ జిల్లాకు చెందిన మంజిత్ కౌర్‌కు.. పాక్‌లోని గుజార్న్‌వాలా ప్రాంతానికి చెందిన అవైజ్ ముక్తార్ అనే యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది..ఈ ఫేస్బుక్ పరిచయము వాళ్ళ ప్రేమకు దారితీస్తుంది అనేసి వాళ్లు కూడా ఊహించలేదు. తర్వాత ప్రేమగా మారింది.ఆ ప్రేమను వాళ్ళు వివాహబంధంగా మార్చుకోవాలని అనుకున్నారు. ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావాలని నిశ్చయించుకున్నారు.

 

అప్పుడు ఆ యువతి  తానే పాక్ వస్తానని చెప్పింది.అక్కడే పెళ్లి చేసుకుందామని కూడా చెప్పింది. ఆమె కర్తార్ పూర్ కారిడార్ ద్వారా పాక్‌ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నది. ఆ యువతికి ఐడీ కార్డు లేకుండా పాకు దేశానికి వెళ్ళడం తప్పు అని కూడా తెలుసు. తన ప్రేమను ఎలాగైనా గెలిపించుకోవాలి అనేదే ఆమె కోరిక. కౌర్ నకిలీ ఐడి కార్డుతో కర్తార్‌పూర్ సరిహద్దు ద్వారా పాక్ భూభాగంలోకి వెళ్లింది. పాకుకు వెళ్ళిన తర్వాత ఆమెపై అనుమానంతో పాక్ రేంజర్లు ఐడీ కార్డును పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది.

 

అక్కడి రేంజర్లు ఆమెను ప్రశ్నించగా తన ప్రియుడ్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చానని చెప్పింది. ఆమె చెప్పిన సమాధానం విన్న పాక్ రేంజర్లు. ఇది చాలా తప్పు అని. ఆమెను మందలించి తిరిగి భారత్ సరిహద్దుకు పంపారు. అలాగే ఆమె ప్రేమించిన యువకుడ్ని కూడా అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 2018లో కూడా సరిగ్గా ఇలాగే మరో మహిళ కూడా తన ప్రియుడి కోసం పాక్ వెళ్లింది. ఈ కాలపు కొందరి అమ్మాయిలను చూస్తే ఇంత ధైర్యం ఎలా వచ్చింది అనిపిస్తుంది. ఏదైనా చట్టబద్ధంగా వెళ్తే ఏ ఇబ్బందులు ఆటంకాలు ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: