పాఠశాలవిద్యార్థులకు ఫిట్‌నెస్‌ పాఠాలు చెప్పాల్సిన వ్యాయామ ఉపాధ్యాయుడు తన వక్రబుద్ధిని చూపించు కొన్నాడు.ముందుగా మనము పాఠశాల విద్యార్థులను తన సొంత బిడ్డల్లా గా చూసుకోవడము ప్రతి ఉపాధ్యాయుడు అలవాటు చేసుకోవాలి. పాఠశాలలో ఉన్నకన్నబిడ్డల్లాంటి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందాన్ని  అలవాటు చేసుకున్నాడు. మచిలీపట్నం మండలం చిన్నాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

దీనిని సీరియస్‌గా తీసుకున్న డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి గారు విచారణ జరిపించి సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేశారు. గురువారం రాత్రి సస్పెండ్ చేసిన ఉత్తర్వులు జారీచేశారు. సస్పెండ్‌ ఉత్తర్వులు, డెప్యూటీ డీఈఓ విచారణ నివేదిక మేరకు ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అని తెలిపారు. చిన్నాపురం హైస్కూల్‌లో వ్యాయామ ఉపా«ధ్యాయుడు(పీడీ)గా పనిచేస్తున్న పి. సాంబశివరావు మాస్టారు వెకిలి చేష్టలు , అసభ్యకరమైన ప్రవర్తన రోజు రోజుకి  శృతిమించడంతో ఆందోళన చెందిన కొంతమంది విద్యార్థులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు.

 

సదరు వ్యాయామ ఉపాధ్యాయుడి వ్యవహారం తేల్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూసిద్ధమయ్యారు.
 ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి రావడంతో ఎందుకైనా మంచిదని ముందస్తు జాగ్రత్తగా ఉన్నతాధికారులకు తెలియజేశాడు. బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కోవడము, ఇదే సమయంలో సదరు వ్యాయామ ఉపాధ్యాయుడు కూడా  సెలవులో ఉండటంతో దీనిలోని  నిజాలు ఎంతవరకు నిజమో అని  తేల్చేందుకు మచిలీపట్నం డెప్యూటీ డీఈఓ బత్తుల సత్యనారాయణమూర్తి గారు రంగంలోకి దిగారు.

 

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇతర సహ ఉపాధ్యాయుల నుంచి జరిగిన పరిణామాలపై అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది బాలికలతో కూడా ఆయన మాట్లాడి వ్యాయామ ఉపాధ్యాయుడి తీరుపై ఆరా తీశారువ్యాయామ ఉపాధ్యాయుడు సాంబశివరావు బాలికలతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని విచారణలో తేలింది. దీనిపై సమగ్ర నివేదికను డీఈఓకు డిప్యూటీ డిఇఓ గారు అందజేశారు.

 

 దిశ ఘటనతో ఓ పక్క దేశవ్యాప్తంగా అట్టుడికిపోతున్న తరుణంలో ఈ వ్యవహారం కూడా వెలుగులోకి రావడంపై జిల్లా విద్యాశాఖాధికారులు తీవ్రంగానే స్పందించారు. వ్యాయామఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయడంతో పాటు, ముందస్తు అనుమతులు లేకుండా హెడ్‌ క్వార్టర్‌ను కూడా విడిచి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువు బాలికలతో ఈ రీతిన ప్రవర్తించడం పై ఉపాధ్యాయవర్గాల్లో సర్వత్రాచర్చనీయాంశమైంది.  వ్యాయామ ఉపాధ్యాయుడు బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా తన విచారణలో తేలిందని డెప్యూటీ డీఈఓ బత్తుల సత్యనారాయణ మూర్తి  ధ్రవీకరించారు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: