వికారాబాద్‌లో ఒక సంఘటన విషాదం చోటుచేసుకున్న ది. పిల్లలు తెలిసి తెలియక పతంగు లను పైకి ఎగరేస్తుండగా.. కరెంట్ షాక్ తగలడంతో ఓ బాలుడు ప్రాణాలు కోల్పో వలసి వచ్చింది. మరో బాలుడు తీవ్రంగా క్షతగాత్రడు అయినాడు.. వివరాల్లోకి వెళ్తే.. పరిగి మండలం బాహర్‌పేట్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ జాహెద్‌ అలీ కుమారుడు జహీర్‌ (9), అదే ఏరియా లో ఉండే పండ్ల వ్యాపారి రఫీ కుమారుడు సమీర్‌ ఇంటి మిద్దె గాలిపటాలు ఎగురవేస్తున్నారు.

 

ఈ క్రమంలో వీరు ఎగరేస్తున్న గాలిపటం హైటెన్షన్ వైర్లలో ఇరుక్కొని పోయినది.. దాన్ని తీసేందుకు పిల్లలు ఇద్దరు గాలిపటము తీసే టందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే పిల్లలిద్దరికీ కరెంట్ షాక్ తగిలింది. ఆ వైర్లు హైటెన్షన్ పవర్ తో ఉండడంతో పిల్లవానికి భారీగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో జహీర్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగినది
జహీర్ ఫ్రెండ్ సమీర్ పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది.

 

హైటెన్షన్ వైర్లకు తగిలిన పతంగిని రాడ్‌తో తీయడానికి పిల్లలిద్దరూ ప్రయత్నించడమే ప్రమాదానికి ప్రధాన కారణం అని అర్థమవుతున్నది. కరెంట్ షాక్ తీవ్రతకు జహీర్ యొక్క కాలు శరీరం నుంచి వేరుపడి పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో సమీర్ కూడా చాలావరకూ గాయాలయ్యాయి. గాయపడిన సమీర్‌ను చికిత్స నిమిత్తం వెంటనే హైదరాబాద్ నగరానికి తీసుకొనివెళ్ళారు. ఈ ఘటనలో కరెంట్ వైర్లు తెగి కింద పడ్డాయి.కరెంటు వైర్లు కింద పడే టప్పుడు క్రింద ఉన్న మరో వ్యక్తి మీద కూడా పడ్డాయి.

 

అతిపెద్ద శబ్దం రావడంతో అక్కడ ఉన్న స్థానికులు చాలా భయపడ్డారు. స్థానికులు వెంటనే తేరుకుని అప్రమత్తమై కరెంటు షాక్ కొడుతుందని అనే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. కాసేపట్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో బాలుడు మరణించడం చాలా దురదృష్టకరమైన విషయము. అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: