మీ-సేవ కేంద్రాలు శుక్రవారం నుంచి మూతపడనున్నాయి. నిరవధికంగా మీ-సేవ ఆపరేటర్లు సమ్మెకు దిగనున్నారు. జిల్లావ్యాప్తంగా 930కు పైగా కేంద్రాలు తమ సర్వీసులను నిలిపివేయనున్నాయి. గ్రామ సచివాలయాల్లో ‘మీ-సేవ’లను అందించేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటంతో.. జీవనోపాధి దెబ్బతింటుందని భావించిన ఆపరేటర్లు సమ్మెకు దిగుతున్నారు. నిరవధిక సమ్మె ద్వారా వీరి ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఉపాధికి దెబ్బ ఉండదని ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని సమాచారం. గ్రామ సచివాలయాల ప్రాజెక్టు పరిధిలోకి ‘మీ-సేవ’లను తీసుకురావటం ద్వారా జిల్లావ్యాప్తంగా వీటిపైనే ఆధారపడి జీవిస్తున్న ఆపరేటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 


 మీ-సేవ కేంద్రాలు మూత పడనుండటంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తుల ప్రక్రియ నడుస్తోంది. ధ్రువీకరణ పత్రాలు మొదలుకొని దరఖాస్తులను పూర్తిచేయటం, ఆన్‌లైన్‌ సేవలు, బిల్లుల చెల్లింపు వంటివన్నీ మీ-సేవ కేంద్రాల నుంచే జరుగుతున్నాయి. తాజాగా కాపునేస్తం పథకానికి వేలాది సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో మీ-సేవ కేంద్రాల ద్వారా రోజుకు మూడు వేలకు పైగా ధ్రువీకరణ పత్రాల కోసమే దరఖాస్తులు వస్తున్నాయి. ఇవి కాకుండా మిగతా సేవలు సుమారు ఇంతకు రెట్టింపులో ఉంటాయి. ఈ నేపథ్యంలో మీ-సేవ ఆపరేటర్లు సమ్మెకు దిగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు, వలంటీర్లకు మీ-సేవల బాధ్యతలను కూడా అప్పజెప్పటంతో, మీ-సేవ కేంద్రాలపైనే ఆధారపడిన నిర్వాహకులకు ఆశనిపాతంగా మారనుంది.


మీ సేవ సిబ్బంది సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవలు నిలిచిపోనున్నాయి. మీ-సేవలను గ్రామ సచివాలయ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడంతో తమ ఉపాధి దెబ్బతినే పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తూ మీసేవా ఆపరేటర్లు సమ్మె బాట పట్టారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు రాష్ట్ర మీసేవా ఆపరేటర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె యుగంధర్‌, ఎస్‌ భానుమూర్తి వెల్లడించారు. తమ సమస్యను పరిష్కరించే వరకూ సమ్మెను ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: