జగిత్యాల జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల పసికందును ఓ వ్యక్తి ఎత్తుకొని పారిపోతున్న సంఘటన అక్కడి వారిని కలకలం రేకెత్తించింది. పాపను ఎత్తుకుని పారిపోతున్న వ్యక్తిని స్థానికులు  చితకబాదారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగినది. ఆ వ్యక్తిని దేహశుద్ధి చేసి స్థానికులు పోలీసులకు అప్పగించారు. అయితే, ఆ బిడ్డను ఎత్తుకొని పారిపోతున్న వ్యక్తి కన్నతండ్రే కావడం అందరినీ ఆశ్చర్యానికి ముంచెత్తింది.


    జగిత్యాల పోలీసుల కథనం మేరకు ఇలా జరిగింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంటకు చెందిన ప్రశాంత్‌కు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నిజామాబాద్‌ పల్లెకు చెందిన సర్వేశ్వరితో కొన్నాళ్ల క్రితం పెళ్లి  జరిగింది. కొంత కాలంగా వారి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడము మామూలైపోయింది. ఈ సమయములోనే సర్వేశ్వరి గర్భిణీ కావడంతో కాన్పు కోసం వాళ్ల పుట్టింటికి వచ్చింది. నెలలు నిండడముతో ప్రసవం కోసము  ఈ నెల 20వ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో చేరింది.

 

 ఆస్పత్రిలోనే ఒక ఆడబిడ్డను ప్రసవించింది. ఆడ పిల్ల పుట్టిందన్న విషయం తెలుసుకున్న ప్రశాంత్‌ సోమవారం జగిత్యాలకు వచ్చి ఆస్పత్రిలో ఉన్న భార్యతో గొడవ పడ్డటం. అక్కడ ఉన్న వారు అందరిని ఆశ్చర్యపరిచింది. అనంతరం శిశువును ఎత్తుకొని చెప్పకుండా ఆస్పత్రి నుంచి పరుగులు పెట్టాడు. ఆస్పత్రి సిబ్బంది అంతలోనే గమనించారు. హాస్పిటల్ సిబ్బంది వెంట పడుతుండడంతో, స్థానికులు అతణ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు అయినా ఆ వ్యక్తి బిడ్డను వదిలి పెట్టలేదు.

 

పసికందును ఇవ్వకపోతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని బిడ్డను తల్లికి అప్పగించి ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకోవడం జరిగినది. అయితే, సోమవారం ఆస్పత్రిలో భార్యా భర్తల మధ్య ఎందుకు గొడవ జరిగింది అన్న విషయం తెలియరావడం లేదు. బిడ్డను ఎత్తుకొని ఎందుకు పరిగెత్తాడనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: