ప్ర‌జ‌ల‌కు-ప్ర‌భుత్వాల‌కు, ప్ర‌జ‌ల‌కు-రాజ‌కీయ నాయ‌కులకు మ‌ధ్య వార‌ధిగా ఉండ‌డం అనే బృహ‌త్ య‌జ్ఞంలో అశిధారా వ్ర‌త‌మే కీల‌క మైలు రాయి. ఎవ‌రు ఎప్పుడు ఎక్క‌డ ఏమ‌న్నా.. ఎక్క‌డ ఎలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకున్నా.. ఎలాంటి మార్పులు సంభ‌వించినా.. ప్ర‌జ‌ల ప‌క్షంగా ప్ర‌జా బాణిని వినిపించ‌డం అంటే అంత ఆషామాషీ విష‌యం కాదు. ప్ర‌లోభాల‌కు లొంగ కుండా... సొంత లాభాల‌ను భేరీజు వేసుకోకుండా స‌మున్న వార్తా ప్ర‌పంచంలో స‌మ‌కాలీన వ్యూహాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డం నిజంగా నేటి పోటీ ప్ర‌పంచంలో ఏ వార్తా సంస్థ‌కైనా స‌వాలుతో కూడుకున్న‌దే.

 

అలాంటి పోటీ ప్ర‌పంచంలో.. ప్ర‌జ‌ల‌కు నిత్యం వార్త‌ల విందు భోజ‌నాన్ని సొంత లాభాలు, స్వ‌ప‌క్ష పాతాల‌కు తావులేకుండా జ‌రిగింది జ‌రిగిన‌ట్టు.. జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను ముందుగానే విశ్లేషిస్తూ.. నిత్యం ప్ర‌జ‌లకు చేరువ అవుతున్న వెబ్ వేదిక ఇండియ‌న్‌ హెరాల్డ్‌. స‌మున్న‌త ల‌క్ష్యాలను ఏర్పాటు చేసుకోవ‌డం ఓ కాగితం.. క‌లం చేసే ప‌ని! దీనిని ఎవ‌రైనా చేయ‌గ‌ల‌రు. కానీ, స‌ద‌రు ల‌క్ష్యాల‌ను సాధించేందుకు, స‌ద‌రు ఉన్న‌త ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు చేసే కృషి అత్యంత ప్రామాణికం. నిత్యం సంఘ‌ర్ష‌ణ‌ల‌కు ఆల‌వాల‌మైన వార్తా ప్ర‌పంచంలో ఎన్నో ఎదురీత‌లు!  మ‌రెన్నో స‌వాళ్లతో కూడిన ప‌యనాలు.. వాటిని ఛేదించుకుంటూ.. ప్ర‌జ‌ల‌కు నిఖార్స‌యిన వార్త‌ల‌ను అందిస్తోంది ఇండియ‌న్‌ హెరాల్డ్‌.

 

ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే మీడియాకు గీటు రాయి! అనే సూత్రాన్ని ఔద‌ల దాలుస్తూ.. నిత్య వార్తా శ్ర‌వంతిని ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తున్న ఇండియ‌న్‌ హెరాల్డ్‌.. ఫోర్త్ ఎస్టేట్‌లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుని ముందుకు సాగుతోంది. పాత మాధుర్యాన్ని ఆశ్వాది స్తూనే.. స‌రికొత్త శ‌తాబ్దిలోకి మ‌రిన్ని ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌తో ఉత్తుంగ త‌రంగ‌మై.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని అభిల‌షిస్తోంది ఇండియ‌న్‌ హెరాల్డ్‌!  రంగ‌త్తుంగ త‌రంగ భంగిమ‌ల‌తో.. అన్న‌ట్టుగా అనేక కోణాల్లో, అనేక రూపాల్లో ప్ర‌జ‌ల‌కు ఈ ప్ర‌పంచంలోని స‌మాచారాన్ని స‌మ‌యానికి... త‌గిన విధంగా అందించే అశిధారా వ్ర‌తంలో మ‌మ్మ‌ల్ని మేం పునీతులం చేసుకుంటూ.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేసే అవ‌కాశం ఈ నూత‌న సంవ‌త్సం క‌ల్పిస్తుంద‌ని ఆశిస్తూ.. ప్ర‌తి ఒక్క‌రికీ నూత‌న సంవ‌త్స‌ర 2020 శుభాకాంక్ష‌లు తెలుపుతోంది ఏపీ హెరాల్డ్‌!!

మరింత సమాచారం తెలుసుకోండి: