ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధాని విష‌యం ఒక్క ఏపీలోనే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అస‌లు ఎందుకు రాజ‌దానిని అమ‌రావ‌తి నుంచి త‌ర‌లిస్తున్నార‌ని ఓ వ‌ర్గం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుండ‌గా.. రాష్ట్రంలో మూడు రాజ‌ధానులు ఎందుకు.. పెద్ద రాష్ట్రం యూపీలోనే 75 జిల్లాలు ఉన్న‌ప్ప‌టికీ ల‌క్నో అనే ఒక్క రాజ‌ధాని మాత్ర‌మే ఉంద‌ని,మ‌రి 13 జిల్లాలు మాత్ర‌మే ఉన్న ఏపీకి మూడు రాజ‌ధానులు అవ‌స‌ర‌మా? అని మ‌రో వ‌ర్గం విప‌రీత ప్ర‌చారం చేస్తోంది.ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకోబోయే నిర్ణ‌యం (ఇంకా తీసుకోలేదు) పై తీవ్ర స్థాయిలో ప్ర‌జ‌ల్లోనూ ఒక‌ర‌క‌మైన ఆందోళ‌న‌ల‌ను క‌లుగజేస్తున్నారు.

 

ఇక‌, గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి, ఆయ‌న పార్టీకి కూడా అనుకూలంగా ఏపీలో ఉన్న ప్ర‌ధాన ప‌త్రిక‌, మీడి యాలోనూ అమ‌రావ‌తికి అనుకూలంగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. పేజీల‌కు పేజీలు వండి వార్చుతున్న నేప థ్యంలో రాష్ట్రంలో గ‌డిచిన రెండు రోజులుగా ఈ విష‌యం మ‌రింత‌గా హాట్ టాపిక్ అయింది. అయితే, ప్ర‌భు త్వం మాత్రం అమ‌రావ‌తిని రాజ‌దానిగా కొన‌సాగిస్తూనే మూడు రాజ‌దానులను ఏర్పాటు చేసేందుకు ప్ర‌య త్నిస్తున్నామ‌ని, త‌ద్వారా రాష్ట్రంలో ప్రాంతీయ అస‌మాన‌త‌లు త‌గ్గి..అభివృద్ది సాకార‌మ‌వుతుంద‌ని చెబు తోంది.

 

అభివృద్ధి అనేది ఒక్క‌చోటే కేంద్రీకృతం అయితే, తెలంగాణ రాష్ట్రం మాదిరిగా వేర్పాటు వా దం పురి విప్పితుంద‌ని హెచ్చ‌రిస్తోంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యాన్ని పెద్ద‌గా ప్ర‌స్థావించ‌ని చంద్ర‌బాబు కానీ, టీడీపీ నేత‌లు కానీ, మ‌రికొ న్ని ప‌క్షాలు కానీ, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. కాగా, ఇక్క‌డే తాజాగా శుక్ర‌వారం రాష్ట్రంలోని అత్య‌ధిక స‌ర్క్యులేష‌న్ ఉన్న ఓ ప‌త్రిక వెల్ల‌డించిన క‌థ‌నం.. ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లేలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వ వాద‌న‌ను బ‌లోపేతం చేసేలా ఉండ‌డం గ‌మ‌నార్హం.

 

మంగ‌ళ‌గ‌రి, గుంటూరు జిల్లా లోని అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌ల గ‌తప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భ‌వ‌నాల‌ను ఫొటోల‌తో స‌హా ప్ర‌చురించారు. ఈ క్రమంలో ఆయా భ‌వ‌నాల‌కు అప్ప‌టి ప్ర‌భుత్వం వెచ్చించిన నిధుల వివ‌రాల‌ను కూడా ఇచ్చారు. దీనిని బ‌ట్టి చూస్తే.. అన్ని ప్ర‌తిష్టాత్మ‌క భ‌వ‌నాలు కూడా ఒక్క అమ‌రావ‌తి ప్రాంతంలోనే పోగుప‌డ్డాయ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. వంద‌లు వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్ర‌భుత్వ భ‌వ‌నాలు, ఆస్తులు అన్నీ కూడా ఇక్క‌డే పోగుప‌డ్డాయి. డీజీపీ కార్యాల‌యం స‌హా అన్ని భ‌వ‌నాలు కూడా మంగ‌ళ‌గిరి.. అమ‌రావ‌తి ప్రాంతంలోనే ఉన్నాయి.

 

అంటే అభివృద్ధి అంతా కూడా కేవలం మంగ‌ళ‌గిరి, అమ‌రావ‌తి ప్రాంతాల‌కే ప‌రిమిత‌మైన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం దీనినే పాయింట్ అవుట్ చేస్తోంది. ఇలా అభివృద్ది అంతా కూడా ఒక్క‌చోటే ఉండిపోతే.. మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ది మాటేంటి ? అనేది స‌ర్కారు ప్ర‌శ్న‌. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకునే మూడు రాజ‌ధానుల ఏర్పాటు విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చింది. మొత్తంగా స‌ద‌రు ప‌త్రిక‌.. ప్ర‌భుత్వానికి యాంటీగా వార్త‌ను ప్ర‌చురించినా.. తుద‌కు ఈ వార్త ప్ర‌భుత్వ వాద‌న‌ను బ‌ల‌ప‌రుస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: